Begin typing your search above and press return to search.

ధూమ్ విలన్ గా మళ్లీ అతనే..

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:30 AM GMT
ధూమ్ విలన్ గా మళ్లీ అతనే..
X
ఇంగ్లిష్‌ లో జేమ్స్ బాండ్ సినిమాలు ఎంత ఫేమస్సో ఇండియన్ ఫ్యాన్స్ కి ‘ధూమ్’ సిరీస్ అంటే అంతే ఆసక్తి. ఈ సిరీస్ లో సినిమా వచ్చినపుడల్లా బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షమే కురుస్తుంటుంది. రికార్డుల మోత మోగుతుంటుంది. అభిషేక్ - ఉదయ్ చోప్రా - జాన్ అబ్రహాం ముఖ్య పాత్రల్లో వచ్చిన ఫస్ట్ పార్ట్ పెద్దగా అంచనాల్లేకుండానే రిలీజై సంచలన విజయం సాధించింది. ఇక ఆ తర్వాతి రెండు భాగాల్లో విలన్ పాత్రల్ని హృతిక్ - అమీర్ ఖాన్ నటించడంతో ఆ సినిమాలపై ఎంత హైప్ నెలకొందో.. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇప్పుడిక ధూమ్-4కు రంగం సిద్ధమవుతోంది. విలన్ ప్రతిసారీ మారుతున్నాడు కాబట్టి.. ఈసారి ఎవరు దొంగ పాత్ర పోషిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ ల పేర్లు వినిపించాయి కానీ.. చివరికి రెండో పార్ట్ లో నటించిన హృతిక్ నే ఆ పాత్రకు ఖాయం చేశారని సమాచారం. ఐతే ధూమ్-2లో విలన్ పాత్రను ఓ రేంజిలో పండించిన హృతిక్ ను మళ్లీ అదే పాత్రలో చూడబోతున్నామన్నమాట. అతడికి జోడీగా ఇంతకుముందు ఐశ్వర్యారాయ్ నటించింది. ఈసారి హృతిక్ తో రొమాన్స్ చేసేదెవ్వరో చూడాలి. ఐతే ఒకే రకమైన కథాకథనాలైనప్పటికీ విలన్ ను మార్చడం ద్వారానే సినిమాకు వైవిధ్యం తీసుకొస్తోంది యశ్ రాజ్ ఫిలిమ్స్. మరి ఈసారి విలన్ ను మార్చకుండా, జనాలకు మొనాటనీ రాకుండా ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.