Begin typing your search above and press return to search.
దాదా గంగూలీ బయోపిక్ హీరో ఎవరు?
By: Tupaki Desk | 25 Feb 2020 5:15 AM GMTబాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ అంతకంతకు హీటెక్కిస్తోంది. సినీరాజకీయ ప్రముఖుల బయోపిక్ లతో పాటు క్రీడాదిగ్గజాల బయోపిక్ లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. గత నాలుగైదేళ్లలో స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బయోపిక్ ల సక్సెస్ రేటు అద్భుతం. బాక్సర్ మేరికోమ్..క్రికెట్ లెజెండ్ ధోనీ.. మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగత్ (దంగల్).. సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారుల జీవితాలపై సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. మధ్యలో కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టినా.. మేకర్స్ స్వయంకృతాలేనన్న విమర్శలొచ్చాయి.
బయోపిక్ అంటే ఎప్పటికీ చెరగని తీపి గురుతు అనే భావించాలి. తాజాగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ జీవిత కథను వెండి తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందులో సూపర్ మ్యాన్ హృతిక్ రోషన్ పేరును టైటిల్ పాత్ర కోసం పరిశీలిస్తున్నారుట. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం కరణ్.. దాదా గంగూలీతో సంప్రదింపులు జరుపుతున్నారట. గంగూలీ కూడా సానుకూలంగానే ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇండియా క్రికెట్ లో గంగూలీ రోల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన సీజన్ లో టీమిండియా కెప్టెన్ గా జట్టును సమర్ధవంతం గా నడపించిన ఆటగాడి గా పేరుంది. సెంచరీలతో కదం తొక్కిన బెస్ట్ బ్యాట్స్ మన్ గానూ దాదాకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
కపిల్ దేవ్ తర్వాత కెప్టెన్సీలో అన్ని మైలురాళ్లను అందుకుంది గంగూలీనే. 1983 వరల్డ్ కప్ తర్వాత 2003లో కొద్దిలో వరల్డ్ కప్ గెలిచే వరకూ తీసుకెళ్లిన ఘనత గంగూలీకి దక్కింది. దురదృష్టవశాత్తూ కప్ కొద్దిలో మిస్ అయింది. ఫైనల్ వరకూ చేరుకోవడం లో కీలక పాత్ర పోషించింది గంగూలీనే. స్పిన్నర్ల పాలిట యమకింకరుడిగా.. సిక్సర్ల పిడుగుగా గంగూలీ దూకుడుకి ఫ్యాన్సున్నారు. ఇక బెంగాల్ టైగర్ గంగూలీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. పర్సనల్ లైఫ్ లోనూ గంగూలీ దూకుడే వేరు. కథానాయిక నగ్మాతో ఎఫైర్ విషయంలోనూ దాదా పేరు మార్మోగింది. అతని లవ్ స్టోరీ లో బోలెడంత ఎమోషన్ దాగి ఉంది. పెద్దల అంగీకరం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో దాదా జీవితం లో ఉన్నాయి. అందుకే గంగూలీ బయోపిక్ హీటెక్కిస్తుందనే అంచనాలు ఉన్నాయి.