Begin typing your search above and press return to search.

విడాకులు పెళ్లికి మాత్రమే.. టూర్లకి కాదు

By:  Tupaki Desk   |   21 July 2016 5:32 AM GMT
విడాకులు పెళ్లికి మాత్రమే.. టూర్లకి కాదు
X
విడాకులు తీసుకున్న జంటలు ఎవరికి వారే యమునా తీరే టైపులో ఉండే రోజులు పోయాయి. ప్రొఫెషన్ కోసమో పిల్లల కోసమో తరచుగా కలవాల్సి వస్తోంది. కేవలం కలిసి మాట్లాడుకోవడమే కాదు.. హాలీడే టూర్స్ కి కూడా వెళ్లిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- సుసానే ఖాన్ లు రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నా.. ఇప్పుడో హాలిడే టూర్ లో కనిపించారు.

రీసెంట్ గా హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. తన ఇద్దరు పిల్లలు హృదాన్ - హృహాన్ లతో లండన్ టూర్ వెళ్లింది. కేవలం పిల్లలతో మాత్రమే కాకుండా.. ఫ్రెండ్స్ తో కలిసి ఈ టూర్ పెట్టుకుంది సుసానే. ఈ గ్యాంగ్ లో సోనాలి బింద్రే- గాయత్రి ఒబెరాయ్ కూడా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ హాలీడే టూర్ లో హృతిక్ రోషన్ కూడా భాగమయ్యాడు. అదుగు ముందు పిల్లల గ్యాంగ్ అంతా స్కూటర్స్ పై రయ్యిమంటూ దూసుకుపోతుంటే.. వెనకాల పెద్దల గ్యాంగ్ కి మధ్యలో టోపీ పెట్టుకుని కనిపిస్తున్నాడు కదా ఈ హీరో.

విడాకులు తమకు మాత్రమేనని.. పిల్లల విషయంలో వారి సరదాల విషయంలో మాత్రం కాదని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది కదూ. రీసెంట్ గా పవన్ కూడా తన పిల్లలు - మాజీ వైఫ్ రేణుతో కలిసి మాల్దీవ్స్ వెళ్లాడనే ప్రచారం ఒకటి నడుస్తోంది లెండి.