Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ నష్టాల కా'బిల్'
By: Tupaki Desk | 26 Aug 2016 6:47 AM GMTబాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్ స్టార్ లలో హృతిక్ రోషన్ పేరు ముందే వినిపిస్తుంది. సినిమా నిర్మాణంతో సమానంగా ఈయన రెమ్యూనరేషన్ ఉంటుందని ఓ టాక్. ఈ స్టార్ కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా.. ఎంత మొత్తమైనా ఇచ్చి చెల్లించేందుకు నిర్మాతలు సై అంటారు. రీసెంట్ గా మొహెంజొదారో చిత్రానికి దారుణమైన టాక్.. బోలెడన్న విమర్శలు వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు రాబట్టేసిందంటే.. ఈ సూపర్ స్టార్ సత్తా అర్ధమవుతుంది.
ప్రస్తుతం ఈ హీరో కాబిల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ పాటికే షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా.. గత కొన్ని రోజులుగా హృతిక్ స్పాట్ లో కనిపించడం మానేశాడు. దీనికి కారణం.. ఈ హీరో వైరల్ ఫీవర్ గురి కావడమే. సెట్ రావడం సంగతి పక్కన పెడితే.. కనీసం ఫోన్ కాల్స్ కూడా హృతిక్ ఆన్సర్ చేయడం లేదట. రోజుకు 12 లక్షలు పైగా ఖర్చు అయిపోతుండడంతో.. షెడ్యూల్ ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నిర్మాతకు ఎదురైంది.
హృతిక్ నుంచి సమాచారం అందితే క్యాన్సిల్ చేద్దామని అనుకుంటే.. అసలు ఈ హీరో అందుబాటులోకే రావడం లేదని తెలుస్తోంది. అయితే హృతిక్ రోషన్ వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నాడని, పూర్తిగా కోలుకున్నాక తర్వాతే.. షూటింగ్‌లో పాల్గొంటాడని సన్నిహితులు తేల్చేస్తున్నారు.