Begin typing your search above and press return to search.

ఐష్ నే అంత ఛీప్ గా అనుకున్నాడా?

By:  Tupaki Desk   |   23 May 2020 6:45 AM GMT
ఐష్ నే అంత ఛీప్ గా అనుకున్నాడా?
X
ఒక్కోసారి ఎదుటి వారిని చూడ‌గానే ఒక అభిప్రాయానికి వ‌చ్చేయ‌కూడ‌దు. అలా ఏదో ఒక అభిప్రాయం బ‌ల‌ప‌డితే త‌ప్పులో కాలేసిన‌ట్టే. అలానే బాలీవుడ్ కండ‌ల హీరో హృతిక్ రోష‌న్ కి.. మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ని చూడ‌గానే త‌ప్పుడు అభిప్రాయం క‌లిగింద‌ట‌. `న‌ట‌న అంత‌గా తెలియ‌ని అంద‌గ‌త్తె!`... ముఖాకృతి అందంగా ఉంది!! అని మాత్ర‌మే అనుకున్నాడ‌ట‌. అయితే త‌న‌ అభిప్రాయం త‌ప్పు అని త‌ర్వాత తెలుసుకున్నాడ‌ట‌. అది కూడా ఆన్ లొకేష‌న్ త‌న ప్ర‌తిభ క‌మిట్ మెంట్ చూసి స్ట‌న్న‌యిపోయాడ‌ట‌. వెంట‌నే మ‌న‌సు మార్చుకున్నాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు హృతిక్.

ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ - అందాల ఐశ్వర్య రాయ్ జోడీ హాటెస్ట్ పెయిర్ గా పరిశ్రమలో పాపుల‌ర‌య్యారు. ఇద్దరూ కలిసి న‌టించిన సినిమాల‌న్నీ హిట్లే. ఈ జంట‌ అసాధారణమైన ప్రదర్శనతో క‌ట్టిప‌డేసారు. అయితే, ఐశ్వర్య నటనా ప్రతిభ గురించి ఆరంభం హృతిక్ రోషన్ కి అంతగా తెలియద‌ట‌. తాను అంద‌గ‌త్తె అయినా అంత ప్ర‌తిభావ‌ని కాద‌ని తాను భావించానని అత‌డు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. త‌ప్పుగా.. మూర్ఖంగా భావించాడని కూడా లెంప‌లేసుకున్నాడు. కొన్నిసార్లు అందం ప్ర‌తిభను దాచేస్తుంద‌ని అత‌డు ఛ‌మ‌త్క‌రించాడు. ఐశ్వర్య లో పైకి క‌నిపించ‌ని ట్యాలెంట్ ఎంతో ఉంద‌ని అన్నాడు.

`ధూమ్ 2` లో మొదటిసారి ఐష్ తో కలిసి పనిచేసినప్పుడు తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని హృతిక్ చెప్పాడు. ఐశ్వ‌ర్యారాయ్ నిబద్ధత .. కాన్ స‌న్ ట్రేష‌న్... చేసే పని పట్ల అంకిత‌భావం చూసి ఆకర్షితుడిని అయ్యాన‌ని తెలిపాడు. ‘ధూమ్ 2’ తరువాత ఈ జోడీ ‘జోధా అక్బర్’.. ‘గుజారీష్’ చిత్రాలతో అభిమానులను రంజింపజేశారు. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మ‌హ‌మ్మారీ కారణంగా ఇద్దరు నటులు ఇంట్లో స్వీయ-నిర్బంధంలో ఉన్నారు.

హృతిక్ రోషన్ చివరిసారిగా టైగర్ ష్రాఫ్ - వాణీ కపూర్ లతో కలిసి ‘వార్’ చిత్రంలో కనిపించాడు. తదుపరి ఫరా ఖాన్ ‘సత్తే పె సత్తా’ రీమేక్ లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే దానిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. మరోవైపు ఐశ్వర్య రాయ్.. మణిరత్నం తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నెగెటివ్ రోల్ పోషించ‌నుంది.