Begin typing your search above and press return to search.

ఏజ్ బారు హీరోయిన్ చెత్త కామెంట్లు

By:  Tupaki Desk   |   29 Aug 2016 3:30 PM GMT
ఏజ్ బారు హీరోయిన్ చెత్త కామెంట్లు
X
ఇప్పుడు వయస్సు 40 ఏళ్లు వచ్చేస్తే హీరోయిన్ గా చేయకూడదా అంటారేమో.. అసలు హాలీవుడ్ లో అయితే ఆ వయస్సు వచ్చాకనే చాలామంది హీరోయిన్లుగా క్లిక్ అవుతారు. కాని మన స్టోరీలు అలా ఉండవ్. అంతా కాలేజీ అమ్మాయిలూ.. యుగళ గీతాలూ.. యువ ప్రేమలే కాబట్టి.. మన సినిమాల్లో హీరోయిన్లు బిలో 30 ఇయర్స్ ఉండి క్యూట్ గా కనిపిస్తేనే నప్పుతారు. ఈ విషయం ఆ 40 ఏళ్ళ బ్యూటి అమీషా పటేల్ కు కాస్త చెప్పండయ్యా.

''నన్ను ఇప్పటికీ చాలామంది కహోనా ప్యార్ హై సీక్వెల్ ఎప్పుడూ అని అడుగుతున్నారు. నాతోపాటు హృతిక్ రోషన్, రాకేష్‌ రోషన్ లను కూడా ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ తీస్తారని అశిస్తున్నాను. ప్రేక్షకులు మా జంటను మళ్లీ చూడాలని తహతహలాడుతున్నారు'' అంటూ కామెంట్ చేసింది అమీషా. అంతే కాదు.. ఇక్కడే ఇంకో చెత్త కామెంట్ చేసి.. అవకాశాలు లేక ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతోందని అందరితో అనిపించుకుంటోంది. ''ఆ సినిమాలో నేనూ-హృతిక్ క్లిక్ అయినట్లు.. అస్తమానం కొత్త హీరోయిన్లు అతగాడి ప్రక్కన క్లిక్కవ్వరు. మొహంజొదారో సినిమా చూసుకోండి.. ఏమైంది?'' అంటూ హీరోయిన్ పూజా హెగ్డేను టార్గెట్ చేసిందీ బంగారం. కాస్త ఓవరే కదూ.

ఆ మధ్యన 'అమీషా జీ' 'అమీషా మ్యామ్' అని పిలువలేదని గొడవపెట్టుకున్న ఈ సుందరి.. ఇప్పుడు చూస్తుంటే రాను రానూ రాఖీ సావంత్ లా తయారైనట్లు లేదూ? అటెన్షన్ కోసం ఏదో ఒక డైలాగ్ పేలుస్తోంది అంతే.. అంటున్నారు బాలీవుడ్ జనాలు.