Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు క్లయిమాక్స్ సిల్లీగా ఉందట
By: Tupaki Desk | 28 Sep 2015 4:45 AM GMTమహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 150కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ రికార్డులతో ఈ సినిమా బాలీవుడ్ హీరోల్ని కదిలించింది. ఈ సినిమా రీమేక్ లో నటించేందుకు హృతిక్ రోషన్ ఆసక్తి కనబరిచాడని దీనికి సంబంధించి ఈరోస్ సంస్థ కొరటాలతో మంతనాలు సాగిస్తోందని వార్తలొచ్చాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టు హృతిక్ మనసును కదిలించింది. అయితే ఈ సినిమాలో హృతిక్ కి నచ్చని అంశాలు కూడా ఉన్నాయనేదే లేటెస్ట్ టాపిక్.
ఒక బిలియనీర్ తన సొంత ఊరికి వచ్చి దానిని బాగు చేసేందుకు తపించడం, ఊళ్లో చుట్టాలు బంధువుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ని తొలగించాలని చూడడం హృతిక్ కి నచ్చింది. అందులో ఎమోషన్ నచ్చింది. అయితే ఈ సినిమా క్లయిమాక్స్ మాత్రం చాలా సిల్లీగా ఉందని హృతిక్ భావిస్తున్నాడట. మహేష్ వెళ్లి ఓ ఫ్యాక్టరీలో విలన్లను చితక్కొట్టేయడం, చివరికి ఆ ఫ్యాక్టరీని బ్లాస్ట్ చేసేయడం వంటి క్లయిమాక్స్ అంతగా రుచించలేదని చెబుతున్నారు. ఈ క్లయిమాక్స్ ని మార్చాల్సిందిగా ఇప్పటికే మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు హృతిక్ సూచించాడుట. ప్రస్తుతం సదరు సంస్థ కొరటాలను కలిసి ఆ క్లయిమాక్స్ ను బాలీవుడ్ కి సరిపడే విధంగా మార్చి ఇవ్వాల్సిందిగా కొరటాలను కోరింది ఆ సంస్థ.
శ్రీమంతుడు తెలుగు ప్రేక్షకులకు కనెక్టయ్యినంతగా బాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? అన్నది డిష్కసన్ పాయింట్. మహేష్ పోకిరి వాంటెడ్ గా తెరకెక్కి అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కానీ ఒక్కడు తెవర్ గా తెరకెక్కి అట్టర్ ఫ్లాపైంది. మరి ఇప్పుడు శ్రీమంతుడు ఏం చేస్తాడో?