Begin typing your search above and press return to search.

డబూరత్నాని- 2021 క్యాలెండర్ పై గ్రీకువీరుడు!

By:  Tupaki Desk   |   2 July 2021 5:30 PM GMT
డబూరత్నాని- 2021 క్యాలెండర్ పై గ్రీకువీరుడు!
X
డబూ రత్నాని క్యాలెండ‌ర్ స్పెషాలిటీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 2021 వార్షిక క్యాలెండర్ నుండి ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌లు హీరోల ఫోటోషూట్లు వైర‌ల్ అయ్యాయి. తాజాగా గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ లుక్ రివీలైంది.

హృతిక్ మోనోక్రోమ్ ఫోటోలో బేర్-ఛాతీతో సాలిడ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఈ లుక్ కోసం అతను చాలా కష్టపడ్డాడని ఆ యాబ్స్ రుజువు చేస్తున్నాయి. ద‌ర్శ‌క‌నిర్మాత కం కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ `గ్రీకు దేవుడు` అని పిలవడంలో ఆశ్చర్యం లేదు.. అంటూ ఈ ఫోటోకి కితాబు ద‌క్కుతోంది.

తాజాగా రిలీజ్ చేసిన‌ హృతిక్ లుక్ అభిమానుల‌కు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. దాదాపు 50 వ‌య‌సులో ఆయ‌న ఇంత ఇస్మార్ట్ గా క‌నిపిస్తున్నారు. అది కూడా ప‌ర్ఫెక్ట్ ఫిట్ దేహాకృతితో గ్రీక్ దేవుడిని త‌ల‌పిస్తున్నాడు! అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలాంటి రూపం ఈ ఏజ్ లో సృష్టించ‌డం అసాధ్య‌మైన‌ది అని పొగిడేస్తున్నారు.

హృతిక్ ఇటీవల తన ఫోటోను షేర్ చేయ‌గా.. అతని మాజీ భార్య ఇంటీరియర్ డిజైనర్ సుస్సాన్ ఖాన్ ``మీరు 21 ఏళ్ళ వయసులో ఉన్నారు`` అని వ్యాఖ్యానించారు. ఈ ఫోటోపై ఆర్ మాధవన్- అభిషేక్ బచ్చన్- టైగర్ ష్రాఫ్- నుష్రత్ భారుచా తదితరులు ప్ర‌శంస‌లు కురిపించారు.

డబ్బూ రత్నాని - 2021 క్యాలెండర్ విషయానికొస్తే,.. ప్రియాంక చోప్రా- విక్కీ కౌషల్ - కృతి సనోన్- టైగర్ ష్రాఫ్- అలియా భట్- సైఫ్ అలీ ఖాన్- విక్కీ కౌషల్- కియారా అద్వానీ,- సన్నీ లియోన్, -అభిషేక్ బచ్చన్ -విద్యా బాలాచన్ ఫోటోషూట్లు రివీల‌య్యాయి. తారా సుతారియా- విజయ్ దేవరకొండ ఈ ఏడాది క్యాలెండర్ లో అడుగుపెట్టారు.

ప్ర‌స్తుతం హృతిక్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అత‌డు క్రిష్ 4 కోసం ప్రిప‌రేష‌న్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మొదటి చిత్రం క్రిష్ విడుదలైన 15 వ వార్షికోత్సవం సందర్భంగా హృతిక్ ఇటీవల చాలా కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో సీక్వెల్ ను ప్రకటించాడు. నసీరుద్దీన్ షా - ప్రియాంక చోప్రా తిరిగి తెర‌పై క‌నిపిస్తారని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈసారి టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో ఫ్యామిలీ డ్రామాతో క్రిష్ 4 ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. ఇందులో నసీరుద్దీన్ షా పాత్ర కృష్ణుడిని త‌ల‌పిస్తే.. ప్రియాంక చోప్రా బిడ్డ కిడ్నాప్ కి గుర‌వుతుంది. కృష్ణుడు టైమ్ మెషీన్ ని నిర్మించి 2006 వరకు తిరిగి ప్రయాణించవలసి వస్తుంది. కోయి మిల్ గయాకు చెందిన గ్రహాంతరవాసి అయిన జాడు ఆపై ప్రియాకు సూపర్ పవర్స్ ఇస్తాడు. ప్రియ కృష్ణుడిని వారి బిడ్డను రక్షించి నసీరుద్దీన్ షా పాత్రను ఓడించడానికి జాడుతో జతకడుతుంది. హృతిక్ ఈ నెల మొదట్లో క్రిష్ 4 ను అధికారికంగా ప్రకటించాడు. ``గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం`` అంటూ హింట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత క‌థ‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి.

క్రిష్ సిరీస్ 2003 లో కోయి మిల్ గయాతో ప్రారంభమైంది. 2006 లో క్రిష్ తో కొనసాగింది. మూడవ చిత్రం క్రిష్ 3.. 2013 లో విడుదలైంది. ఈ మూడు చిత్రాలకు హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించారు.

నాలుగో భాగంలో హృతిక్ నాలుగు పాత్రలు పోషిస్తారనే పుకార్లను రాకేష్‌ తోసిపుచ్చారు. క్రిష్ 4 గురించి అనేక పుకార్ల మాదిరిగా ఇది కేవలం పుకారు మాత్రమే. దీనికి ఎటువంటి నిజం లేదు. స్క్రిప్ట్ అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. ఇది ఇప్పటికి ప్రారంభమైంది. ప్లాట్ లోని కొన్ని ప్రత్యేకతలను మేము లాక్ చేసినప్పుడు నేను వాటిని మీతో పంచుకుంటాను.. అని రాకేష్ రోష‌న్ తెలిపారు. రాకేశ్ రోషన్ ప్ర‌స్తుతం క‌థానాయిక‌ల వేట‌లో ఉన్నారు. క్రిష్ 4 కోసం కియ‌రా లేదా కృతి ఇద్ద‌రినీ సంప్ర‌దించార‌ని తెలిసింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు న‌టించేందుకు స్కోప్ ఉండ‌గా.. ఆ ఇద్ద‌రికీ ఛాన్సుంటుందా లేక‌పోతే ఎవ‌రో ఒక‌రిని ఎంపిక చేసే వేరొక నాయిక కోసం ప్ర‌య‌త్నిస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.