Begin typing your search above and press return to search.
కంగనపై స్టార్ హీరో నిర్వేదం?
By: Tupaki Desk | 8 July 2019 4:10 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - క్వీన్ కంగన రనౌత్ మధ్య వివాదాల గురించి తెలిసిందే. 2015-16 నుంచి ఆ ఇద్దరి మధ్యా కోర్టుల పరిధిలో రచ్చ సాగుతోంది. వీలున్న ప్రతి వేదికపైనా హృతిక్ తో కంగన గిల్లి కజ్జాలు ఆడుతోంది. కంగనకు సపోర్టుగా సిస్టర్ రంగోలి బరిలో దిగి చీల్చి చెండాడడం ఇటీవల చర్చకొచ్చింది. హృతిక్ -రాకేష్ రోషన్ బృందంపై సిస్టర్స్ పై చేయి సాధించేందుకు చేయని ప్రయత్నమే లేదు.
మొన్నటికి మొన్న హృతిక్ నటించిన సూపర్ 30 చిత్రానికి పోటీగా `మెంటల్ హై క్యా` (జడ్జిమెంటల్ హై క్యా గా మారింది) రిలీజ్ కి కంగన - ఏక్త జోడీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సూపర్ 30 చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని హృతిక్ ప్రకటించారు. దాంతో అతడు వెనక్కి తగ్గడంపై రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే ఈ మొత్తం వివాదాలపై హృతిక్ తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.
అవతలివారు (కంగన) గొడవకు దిగినా తాను మాత్రం వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాని హృతిక్ ఆ ఇంటర్వ్యూలో అన్నారు. గొడవకు దిగడాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నించే వారికి ఇకపై ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆరేళ్లుగా ఈ సర్కస్ ని వినోదంగా భావించి కొనసాగేలా చేశారు. వాళ్ల వల్లనే ఇదంతా.. అంటూ కాస్తంత నిర్వదంగానే మాట్లాడాడు. అసలు చట్టబద్ధమైన పోరాటాన్ని నేను నేరుగా ఆ లేడీ (కంగన)తో పోటీకి దిగలేదు. ఇండియాలో ఒక యువకుడు చట్టపరిధిలో ఆడాళ్లపై పోరాటం సాగించడం అన్నది ఎండింగ్ అన్నదే లేని వ్యవహారం కిందే లెక్క.. అనీ హృతిక్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం. ఒక రకంగా కంగన పై గొడవ ముగిసే వ్యవహారం కాదని ఇలానే కొనసాగుతుందని.. అది ఎప్పటికీ తెగదనీ హృతిక్ సూటిగానే వ్యాఖ్యానించడం అతడిలో నిర్వేదాన్ని బయటపెట్టింది.