Begin typing your search above and press return to search.
200 పేజీల స్క్రిప్టు 80 పేజీలయ్యాకే..
By: Tupaki Desk | 14 July 2016 7:44 AM GMTతొలి సినిమా ‘లగాన్’నే మూడున్నర గంటల నిడివితో రిలీజ్ చేశాడు అశుతోష్ గోవారికర్. అతడి తర్వాతి సినిమాలు కూడా అంతే. స్వదేశ్.. జోధా అక్బర్ కూడా లెంగ్తీ సినిమాలే. ఎక్కువగా చారిత్రక నేపథ్యంతో తీస్తాడు కాబట్టి నిడివి ఎక్కువే ఉంటాయి అతడి సినిమాలు. ‘మొహెంజదారో’ కూడా పెద్ద సినిమానే అయి ఉంటుందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఐతే తాను కూడా పెద్ద సినిమాకే ప్రిపేరై ఉన్నప్పటికీ.. అశుతోష్ తన అంచనాల్ని మించిపోయి పెద్ద సినిమాతో రెడీ అయిపోయాడని.. సినిమా నిడివి తగ్గిస్తే తప్ప సినిమా చేయనని చెప్పడంతో అశుతోష్ తప్పదన్నట్లు లెంగ్త్ తగ్గించాడని అంటున్నాడు హృతిక్ రోషన్.
‘‘జోధా అక్బర్ రూపంలో నాకో మంచి సినిమా ఇచ్చాడు అశుతోష్. ‘మొహెంజదారో’కు కూడా నన్నే కథానాయకుడిగా పెట్టుకోవడం నా అదృష్టం. ఐతే ఈ సినిమా ఒప్పుకునే ముందు 200 పేజీల స్క్రిప్టును 80 పేజీలకు తగ్గిస్తేనే సినిమా చేస్తానని షరతు పెట్టాను. అలాగే తగ్గించాడు అశుతోష్’’ అని హృతిక్ చెప్పాడు. ‘మొహెంజదారో’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయమవుతున్న పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు స్కూల్లో మొహెంజదారో పాఠం చదివాను. చాలా బోర్ గా అనిపించింది. కానీ సినిమా మాత్రం అలా ఉండదు. ఈ సినిమాను నేను నటించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చాలామంది హీరోయిన్లకు ఎంట్రీ గొప్పగా జరిగి ఉండొచ్చు. కానీ హృతిక్ రోషన్ సినిమాతో కథానాయికగా పరిచమవుతున్న అదృష్టవంతురాల్ని నేను’’ అని చెప్పింది. ఆగస్టు 12న మొహెంజదారో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.