Begin typing your search above and press return to search.
సాక్ష్యాలు లేవంటున్న కండల వీరుడు
By: Tupaki Desk | 2 Aug 2016 4:39 AM GMTఅసలు 'మొహంజొదారో' సినిమా విషయంలో ఇప్పటికే చరిత్రకారులకు మండిపోయింది. పది వేల సంవత్సరాల నాటి కాల పరిస్థితులను కళ్లకు కట్టేలా తెరకెక్కించకుండా.. ఇలా చరిత్రను వక్రీకరించి డిజైనర్ బట్టలూ వేషాధారణలూ వేయిస్తారా అంటూ హిస్టారియన్లు ట్రైలర్ చూసినప్పటి నుండీ చెలరేగిపోతున్నారు. ఇంతకీ ఈ విషయంపై సినిమా హీరో.. కండల వీరుడు హృతిక్ రోషన్ ఏమంటున్నాడంటే..
నిన్న ఓ ఈవెంట్లో పాల్గొనడానికి హైదరాబాద్ ఫోరం మాల్ కు విచ్చేశాడు ఈ కహోనా ప్యార్ హై స్టార్. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ అందరూ సూపర్ అన్నారు. కాని హిస్టారియన్లు మాత్రం నాహ్ అన్నారు. అయితే వాళ్ళు చెప్పే థియరి ప్రకారం లుక్ అండ్ డిజైన్ ఇంకోలా ఉండాలనేది వాదన. కాని ఏది నిజం? దేనికీ సాక్ష్యాలు లేవు. ఏది నిజం ఏది కాదు అనేది చెప్పలేం. అలాగే చరిత్రకారులే ఒక్కొక్కరూ ఒక్కొక్క థియరీ చెబుతుంటే.. ఎవరిది తీసుకుంటాం? సో.. దర్శకుడు అశుతోష్ తనకు నచ్చిన ఒక థియరీతో ముందుకెళ్ళాడు అంతే'' అంటూ సింపుల్ గా తేల్చేశాడు హృతిక్. అంతే కాదు.. గతంలో ఈ హీరో-దర్శక ద్వయం ''జోదా అక్బర్'' సినిమా తీసినప్పుడు కూడా హిస్టారియన్లు ఇలాగే బూతులు తిట్టారట. కాని ఆ సినిమా సూపర్ హిట్టయ్యింది.
''చరిత్ర ప్రకారం చూసుకుంటే.. అక్బర్ చక్రవర్తి 4 అడుగుల 10 అంగుళాల హైట్ ఉంటాడు. కాని హృతిక్ 6 అడుగులు ఉన్నాడు కాబట్టి.. సినిమా వేస్ట్ అన్నారు కొందరు. కాకపోతే సినిమా అనేది ఎంటర్టయిన్ చేస్తున్నందుకు తీస్తున్నప్పుడు.. కొన్ని లిబర్టీస్ తీసుకోక తప్పదు. అది కూడా అందరూ అర్ధం చేసుకోవాలి'' అంటూ తనదైన స్టయిల్లో హృతిక్ చెప్పడం అందరికీ నచ్చేసింది.