Begin typing your search above and press return to search.
హీరోయిన్ కి గురువుగా మారిన హీరో
By: Tupaki Desk | 19 Aug 2017 5:39 PM GMT2010 లో మిస్ యూనివర్స్ సెకండ్ రన్నరప్ కిరీటాన్ని దక్కించుకున్న భామ పూజ హెగ్డే. మొదట ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్ గా ఎదిగిన ఈ భామ ఆ తర్వాత పలు ప్రముఖ కంపెనీ యాడ్స్ లో మెరిసింది. ఇక ఆ తర్వాత కోలీవుడ్ లో మొదటి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యి పరవాలేదనిపించింది. ఇక తన అదృష్టంతో తెలుగులో ముకుందా సినిమాతో అడుగుపెట్టి అరకొర ఛాన్సులు దక్కించుకునే ప్రయత్నం చేసింది. కానీ తీసిన చిత్రాలు ఏవి అంతగా ఆడలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది.
2016లో హృతిక్ రోషన్ హీరోగా అశుతోష్ గోవారికిర్ దర్శకత్వంలో తెరకెక్కిన "మొహెంజో దారో" సినిమాలో ఛాన్సును దక్కించుకొని అదృష్టవంతురాలు అనిపించుకుంది పూజా. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా నిరాశచెందిందట. దీంతో ఆ తర్వాత హృతిక్ రోషన్ ఆమెకు చాలా దగ్గర అయ్యాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూజా కి హృతిక్ గురువుగా మారాడని అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ పూజ హెగ్డే తెలుగులో చేసిన దువ్వాడ జగన్నాథం అమె గ్లామర్ ను పరిచయం చేయడంతో అదే కొన్ని ఛాన్సులు తెచ్చి పెడుతోంది. అయితే బాలీవుడ్ లో ఛాన్సులు లేవు కాబట్టి.. ఆమె పరిస్థితిని అర్ధం చేసుకొని హృతిక్ రోషన్ ఓ రెండు ఆఫర్లని పూజ కోసం రికమండ్ చేస్తున్నాడట. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎదో రిలీషన్ ఉందంటూ గాసిప్స్ వినబడుతున్నాయి.
హృతిక్ కూడా తన భార్య సుసాన్ నె ఖాన్ కి విడాకులు ఇచ్చినప్పటి నుండి పూజతో క్లోజ్ గా ఉంటున్నాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. కాని మనోడు చాలామంది హీరోయిన్లకు అలా గురువుగా వ్యవహరిస్తాడు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నారు బాలీవుడ్ పెద్దలు. పూజ ఏ విషయాన్నైనా హృతిక్ కి చెప్పిగాని చేయడం లేదని టాక్ వచ్చింది కాని.. దాన్ని రిలేషన్ అనేయడం తప్పులే.