Begin typing your search above and press return to search.
ద్రౌపది గా దీపిక.. శ్రీకృష్ణుడి గా హృతిక్
By: Tupaki Desk | 24 Dec 2019 9:58 AM GMTబాలీవుడ్ లో `మహాభారతం` ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ లోనూ దీని పై ఆసక్తికర చర్చ సాగుతోంది. మధుమంతెన నిర్మాతగా దీపిక పదుకొనే సహనిర్మాతగా పలు కార్పొరెట్ కంపెనీల అండతో ఈ ప్రాజెక్ట్ ఒక ఫ్రాంఛైజీ గా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. బహుభాషల్లో మహాభారతంని తెరకెక్కించాలన్నది ప్లాన్. అయితే ఇటీవల కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మేకర్స్ తాజాగా దీపికను ద్రౌపది పాత్ర కు ఖాయం చేస్తూ ప్రకటించేయడం ఆసక్తిని రేకెత్తించింది.
ఆ క్రమం లోనే ఈ చిత్రం లో శ్రీకృష్ణుడు సహా ఇతర పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు? అన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. శ్రీకృష్ణుడి పాత్ర కోసం హృతిక్ రోషన్ తో మధు మంతెన మంతనాలు సాగించారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్రకు అమీర్ ఖాన్ కానీ అక్షయ్ కుమార్ కానీ అయితే బావుంటుందని మేకర్స్ భావించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పాత్రకు హృతిక్ ని సంప్రదించడం ఆసక్తిని పెంచుతోంది.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ద్రౌపది పాత్రలో దీపికను తప్ప వేరొకరిని ఊహించుకోలేనని ఈ సందర్భంగా మధు మంతెన అన్నారు. బాజీరావ్ మస్తానీ- పద్మావత్ చిత్రాలు చూశాక రాణి పాత్ర అంటే దీపికనే అన్న భావన కలిగిందని వ్యాఖ్యానించారు. ద్రౌపది కోణంలో తెరకెక్కే ఈ చిత్రంలో దీపిక చేరికతో అంతర్జాతీయ స్థాయి అప్పీల్ పెరిగిందని అన్నారు. తెలుగు- హిందీ సహా అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. ఒక సిరీస్ గా తెరకెక్కే ఈ చిత్రం నుంచి తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలిపారు. అన్నట్టు అమీర్ ఖాన్ మహాభారతం సిరీస్ ని అటకెక్కించిన అనంతరం దీపిక-మధు మంతెన కాంబినేషన్ ప్రయత్నాలు ఆసక్తిని పెంచుతున్నాయి.