Begin typing your search above and press return to search.
సూర్య సినిమాలో హృతిక్?
By: Tupaki Desk | 25 April 2016 4:10 AM GMTదర్శకుడు విక్రమ్ కె.కుమార్ తీసే సినిమాలన్నింటికీ యూనివర్సల్ అప్పీల్ వుంటుంది. ఈ కథని వేరొక భాషలో చూడలేరన్న మాటే వినిపించదు. అందుకే విక్రమ్ ఎక్కడ ఏ సినిమా తీసినా దాన్ని మరొక భాషలో రీమేక్ చేస్తే బాగానే వుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. మొన్నటికి మొన్న మనం సినిమా తీయగానే దాన్ని బాలీవుడ్ సైతం భలే సినిమా అని మెచ్చుకొంది. తామూ రీమేక్ చేస్తే బాగుంటుందని పలువురు దర్శకనిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఈరోజు కాకపోతే రేపు ఆ సినిమా హిందీలో తెరకెక్కడం ఖాయమని చెప్పొచ్చు.
తాజాగా విక్రమ్ తీసిన 24పై కూడా అప్పుడే బాలీవుడ్ కన్ను పడింది. ఆ సినిమా విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదని భావిస్తున్న పలువురు ఇప్పటికే రైట్స్ కోసం కట్చీఫ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్స్ దక్కించుకొనే విషయంలో ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. టైమ్ ఆధారంగా సాగే ఈ చిత్రకథ ఆయనకి బాగా నచ్చిందట. ట్రైలర్ చూడగానే ఫిదా అయిపోయాడట. తన తనయుడితోనే ఈ సినిమాని తెరకెక్కించాలని స్వయంగా బేరసారాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 24 చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మించారు. మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాకి ఇప్పుడున్న క్రేజ్‌ని చూస్తుంటే సూర్యకి విజయమే కాదు, లాభాల పంట పండడం కూడా ఖాయమని అర్థమవుతోంది. విక్రమ్ కుమార్ కూడా ఇకనుంచి బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.