Begin typing your search above and press return to search.
'క్రిష్ 4' కోసం పాట పాడనున్న హృతిక్ రోషన్!
By: Tupaki Desk | 27 Oct 2021 10:35 AM GMTబాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం .. అక్కడ నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదు. సల్మాన్ .. షారుక్ .. ఆమిర్ ఇలా ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటూ బాలీవుడ్ ను శాసిస్తున్న సమయంలో అడుగుపెట్టే సాహసం మరొకరు చేయలేరు. ఒకవేళ ధైర్యం చేసి అడుగుపెట్టినా, అందరిదృష్టినీ .. మార్కెట్ ను తమ వైపు తిప్పుకోవడం అనుకున్నంత తేలిక కాదు. అలాంటి పరిస్థితుల్లోనే హృతిక్ రోషన్ బాలీవుడ్ లోకి భారీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, అది ముగ్గురు ఖాన్ లను ఒకేసారి ఎదుర్కొనేంత బలమైనది కాదు.
అయినా పోరాడితే పోయేదేమీ లేదు అనే తరహాలోనే హృతిక్ రోషన్ రంగంలోకి దిగిపోయాడు. తొలి సారిగా హృతిక్ రోషన్ ను తెరపై చూసిన వాళ్లు, హాలీవుడ్ హీరో అదుపుతప్పి బాలీవుడ్ కి వచ్చాడేమో అనుకున్నారు. అప్పటివరకూ సల్మాన్ కండల గురించే మాట్లాడుకుంటూ వచ్చిన ప్రేక్షకులు, హృతిక్ కండలు చూసి నివ్వెరపోయి .. నిర్ఘాంతపోయి .. కొయ్యబారిపోయారు. యాక్షన్ లో ఆ దూకుడు .. డాన్స్ లో ఆ స్పీడ్ చూసి షాక్ అయ్యారు. తొలి సినిమాతోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న హృతిక్, ఆ తరువాత కూడా అదే స్థాయిలో చెలరేగిపోయాడు.
లవ్ .. రొమాన్స్ కి సంబంధించిన కథానాయకుడిగా కూడా తాను రెండు స్క్రిప్టులు ఎక్కువగానే చదువుకున్నానని నిరూపించాడు. ఫిజిక్ పరంగా ఒక సూపర్ హీరోకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ తో ఆ తరహా సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అలా తెరపైకి 'క్రిష్' వచ్చింది. ఇక ఈ సినిమా సంచలన విజయానికి సరికొత్త అర్థం చెప్పింది. హృతిక్ రోషన్ క్రేజ్ ను అమాంతంగా .. ఆకాశమే హద్దుగా పెంచేసింది. మధ్య మధ్యలో మిగతా సినిమాలు చేసినా, 'క్రిష్' సిరీస్ లో వచ్చిన సినిమాలు ఆయనను ఎవరెస్టు ఎత్తులో నిలబెట్టాయి.
హృతిక్ రోషన్ నటుడిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇన్ స్టాలో "ఇది గతం .. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం" అని రాసుకొచ్చారు. 'క్రిష్ 4'కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా చెప్పాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ మాట్లాడుతూ .. "ప్రస్తుతం 'క్రిష్ 4' కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనీ, ఈ సినిమాలో ఆయన ఒక పాట కూడా పాడనున్నాడని చెప్పారు. ఇక 'క్రిష్ 4' వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.