Begin typing your search above and press return to search.
కొత్త ప్రియురాలితో గ్రీక్ గాడ్ అన్ స్టాపబుల్ యాత్ర
By: Tupaki Desk | 16 July 2022 2:30 AM GMTఇది డేటింగుల సీజన్.. విహార యాత్రలకు బాగా కలిసొచ్చే కాలం. చలి ప్రవేశించక ముందు నుంచే వరుసగా జంటలు విదేశీ విహారాల్లో మునిగి తేల్తున్నాయి. విదేశాల్లో ఎగ్జాటిక్ స్పాట్స్ నుంచి అదిరిపోయే కపుల్ గోల్స్ ఫోటోలను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని సెలబ్రేషన్ ని ఫ్యాన్స్ కి చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రియురాలు సాబా ఆజాద్ తో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్యారిస్ వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ తో కలిసి పారిస్ కు రొమాంటిక్ వెకేషన్ ప్లాన్ చేసిన సబా ఆజాద్ తన ఇన్ స్టా కుటుంబానికి నిరంతరం అప్ డేట్స్ అందిస్తోంది. ఇంతకుముందు పారిస్ లో ఒక అడవిలో కార్ ప్రయాణంలో ఉన్న వీడియోని షేర్ చేయగా వైరల్ అయ్యింది.
ఇప్పుడు మరోసారి లేటెస్ట్ అప్ డేట్ అందించింది. ఈ ఫోటోల్లో హృతిక్ - సబా ఒకరికొకరు దగ్గరగా పోజులిస్తూ కనిపించారు. రోనీ స్కాట్ - జాజ్ క్లబ్ లో తమ విలువైన సమయాన్ని ఆస్వాధిస్తోంది ఈ జంట. పాటలు వింటూ పానీయాలు తాగుతూ స్వేచ్ఛా జీవనాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లింది.
ఒక ఫోటోలో హాట్ కపుల్ స్లైసీ పానీయాలతో పోజులిచ్చారు. హృతిక్ బ్లూ జీన్స్ బ్లాక్ టీ-షర్ట్ లో డాపర్ లుక్ తో కనిపిస్తుండగా.. సబా తెల్లటి షర్ట్ లేత గోధుమరంగు ప్యాంట్ లో అందంగా కనిపిస్తోంది.
తదుపరి హృతిక్ రోషన్ చిత్రీకరించిన వీడియో కూడా ఉంది. మూడవ పోస్ట్ లో ఈ జంట ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని జాజ్ క్లబ్ ముందు పోజులు ఇస్తున్నారు. ఫోటోని షేర్ చేస్తూ సబా ఆజాద్ దానికి ``ఎక్కడ జాజ్ కిడ్స్??`` అని శీర్షిక పెట్టారు. ఇంతకుముందు Au Revoir Paris (వీడ్కోలు పారిస్) అని శీర్షికతో కొన్ని ఫోటోలను సాబా షేర్ చేసింది. కాఫీ డేట్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి.
హృతిక్ రోషన్ - సబా ఆజాద్ కొంతకాలంగా ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు సందర్భంగా వారి సంబంధాన్ని రెడ్ కార్పెట్ అధికారికంగా ప్రకటించారు. తరచుగా వారు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. పారిస్ కు బయలుదేరే ముందు హృతిక్ రోషన్ తన కుమారులు హృదాన్ - హ్రేహాన్ లతో కలిసి లాస్ ఏంజిల్స్ లో ఉన్నాడు. తన రుచికరమైన అల్పాహారం ఫోటోలను షేర్ చేసి హృతిక్ ``నా దేవా! నేనే ఆశ్చర్యపోతున్నాను.. నేను తరచుగా వండాలి.. ఎంత టాలెంట్! నేను అద్భుతం.. అంటూ తాను వండిన వంటకాలను షేర్ చేసాడు. కిడ్స్ తో బ్రేక్ ఫాస్ట్ ని హృతిక్ ఆస్వాధించాడు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించిన విక్రమ్ వేద విడుదలకు సిద్ధమవుతోంది. దీపికా పదుకొణెతో కలిసి `ఫైటర్` మూవీలోనూ నటిస్తున్నాడు.