Begin typing your search above and press return to search.

ప్రియురాలితో ప్లాట్ షిప్టింగ్ పచ్చి అబ‌ద్దం అనేసిన హృతిక్!

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:30 AM GMT
ప్రియురాలితో ప్లాట్ షిప్టింగ్ పచ్చి అబ‌ద్దం అనేసిన హృతిక్!
X
బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్... సుస్సానే ఖాన్ విడాకుల అనంత‌రం హృతిక్ యువ న‌టి స‌బా ఆజాద్ తో డేటింగ్ లో ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ప్ర‌చారం మ‌రింత  ముదిరింది. ఇద్ద‌రు జంట‌గా మీడియా కంట ప‌డ‌టం స‌హా...విదేశీ వెకేష‌న్లు..పార్టీలంటూ ఇద్ద‌రూ చిలౌట్ అవుతున్నారు. ఇద్ద‌రు త్వ‌ర‌లోనే 38 వేల చ‌ద‌ర‌పు అడుగుల గ‌ల 100 కోట్ ఖ‌రీదు గ‌ల ప్లాట్ లోకి మారుతున్నార‌ని నెట్టింట ప్ర‌చారం ఠారెత్తిపోతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ అద్దె ప్లాట్ లోఉంటోన్న జంట అధికారికంగా  ఇక‌పై  సొంత ప్లాట్ లోనే కాపురం పెట్టేస్తున్నారని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు  వేడెక్కించాయి. దీంతో హృతిక్ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది.

ఈ వార్త‌ల‌న్ని ఒట్టి పుకార్లేన‌ని కొట్టిపారేసారు.  నేను ప‌బ్లిక్  ఫిగ‌ర్ కావ‌డంతో  నాకు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని తెలుసుకోవాల‌ని చాలా మంది అనుకుంటున్నారు.  

అభిమానులు ఇలాంటి విష‌యాల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.  ఇది స‌హ‌జంగా చోటుచేసుకునేదే. వీటి గురించి అంత‌గా ఆలోచించాల్సిన  ప‌నిలేదు.  కానీ అదే స‌మ‌యంలో త‌ప్పుడు వార్త‌ల‌పై నోరు మెద‌ప‌కుండా ఉండ‌టం మంచిది కాదు అన్న‌ది నా ఉద్దేశం. అందుకే ఈప్లాట్ క‌థ ఏంటో చూద్దామ‌ని ముందుకొస్తున్నా. స‌బాతో కొత్త ఇంట్లో కి వెళ్తున్నాను అన్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని వెల్ల‌డించారు.

దీంతో ఈ 100 కోట్ల‌ప్లాట్ స్టోరీకి ఇక్క‌డితో పుల్ స్టాప్ ప‌డ్డ‌ట్లు అయింది. అయితే స‌బాతో డేటింగ్ విష‌యాన్ని హీరోగారు అధికారికం చేయ‌లేదు అన్న‌ది గుర్తించాలి. ఇద్దరు సీక్రెట్ ప్ర‌దేశాల్లో దొరికిన ఫోటోల ఆధారంగా వాళ్ల రిలేష్షిప్ గురించి వార్త‌లొచ్చాయి త‌ప్ప రిలేష‌న్ లో ఉన్నామ‌ని ఇద్ద‌రు ఏనాడు  చెప్పింది లేదు. అలాగే స‌బా వృత్తిగ‌త జీవితంలో హృతిక్ వెన్నంటే ఉన్న‌ట్లు ప్రచారం సాగుతోంది.

త‌న‌కున్న‌ప‌రిచ‌యాల‌తో ప్రియురాలికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ట్లు చాలా కాలంగా వైర‌ల్ అవుతోంది.  ఆ బ్యూటీ హృతిక్ తో రిలేష‌న్ షిప్ కార‌ణంగానే  అంద‌రికీ తెలిసింది. అప్ప‌టివ‌ర‌కూ కొద్ది మందికే ప‌రిచ‌య‌మైన స‌బా దేశం మొత్తం ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.