Begin typing your search above and press return to search.
ఆస్ట్రేలియాలో 'సాహో'కు షాక్
By: Tupaki Desk | 22 Aug 2019 4:23 AM GMT'సాహో' చిత్రం కోసం కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా సాహో కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ఆన్ లైన్ బుకింగ్ చూస్తుంటే అర్థం అవుతుంది. మామూలుగా అయితే ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు అమెరికాలో భారీగా వసూళ్లను రాబడతాయి. ఇతర దేశాల్లో నామమాత్రంగానే వసూళ్లు ఉంటాయి. కాని సాహోకు ఆస్ట్రేలియాలో షాకింగ్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
అమెరికా.. ఆస్ట్రేలియా.. సౌదీ ఇలా ఎన్నో దేశాల్లో సాహో చిత్రంను విడుదలకు సిద్దం చేశారు. మరో వారం రోజుల్లో సినిమా విడుదల నేపథ్యంలో ఆన్ లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. అన్ని చోట్ల కూడా భారీగా బుకింగ్ జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆస్ట్రేలియాలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ జరగడం చర్చనీయాంశం అయ్యింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ.. మెల్బోర్న్ ఇంకా ప్రముఖ నగరాల్లో సాహో స్క్రీనింగ్ ఉంది. ఈ సినిమా స్క్రీనింగ్ ఉన్న ప్రతి చోట కూడా అడ్వాన్స్ బుకింగ్ లు భారీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక అమెరికాలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. సాహోకు నైజాం ఏరియాలో ఏ స్థాయిలో వసూళ్లు నమోదు అవుతాయో అంతకుమించి అమెరికాలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాకుండా మొత్తం అయిదు భాషల్లో కూడా అమెరికాలో విడుదల చేయబోతున్నారు. ఆ కారణంగా అక్కడ రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది. బాహుబలి స్టార్ అవ్వడం వల్ల అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంను చూసే అవకాశాలున్నాయి. మొత్తానికి సాహో చిత్రం కలెక్షన్స్ లో సంచలనం సృష్టించడమయితే కన్ఫర్మ్ అన్నట్లుగా ఉంది.