Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' కు భారీ అడ్వాంటేజ్
By: Tupaki Desk | 14 Jun 2022 6:30 AM GMTరానా దగ్గుబాటి హీరోగా నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ `విరాటపర్వం`. వేణు ఊడుగుల తెరకెక్కించారు. సాయి పల్లవి చుట్టూ సాగే సివిల్ వార్ బేస్డ్ లవ్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. 1992 లో జరిగిన ఓ యాదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్టుగా దర్శకుడు వెల్లడించారు. ఓ యువతి చుట్టూ జరిగిన రాజకీయ నేపథ్యాలని కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నమే ఈ మూవీ.
సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్. ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. రానా హీరో అయినా సినిమా మొత్తం సాయి పల్లవి చుట్టూ తిరగుతుంది. కథ ప్రధానంగా ఉత్తర తెలంగాణలో 1990 లో జరిగిన సంఘటనలు, నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే సినిమా ఇది. కామ్రేడ్ రవన్న `అరణ్య` పేరుతో రాసే కవితలకు ప్రేరేపితురాలైన వెన్నెల అనే యువతి అతన్ని వెతుక్కుంటూ అడవి బాటపడుతుంది.
ఈ క్రమంలో తను ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ `విరాటపర్వం`. గత ఏడాది కాలగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు జూన్ 17న బారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. లేట్ గా వస్తున్నాఈ మూవీకి మంచి అడ్వాంటేజ్ అభించింది. ఇటీవల విడుదలైన సినిమాలు వారం రోజుల తరువాత ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోతున్నాయి. గత కొన్ని వారాలుగా వరుసగా పెద్ద సినిమాలు విడుదలయ్యాయి.
కానీ ఫస్ట్ వీక్ తరువాత మాత్రం నిరాశను పరిచాయి. మే 27న `ఎఫ్ 3` విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత విడుదలైన మేజర్, విక్రమ్ కూడా సూసర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ ల తరువాత `ఎఫ్ 3` కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
ఇక ఆ తరువాత వచ్చిన `అంటే సుందరానికి` కారణంగా `విక్రమ్` వసూళ్లపై ప్రభావం పడింది. ఈ మూవీ తరువాత వచ్చే వారం `విరాటపర్వం` రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నాని సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.
`విరాటపర్వం` తరువాత ఆ డ్రాప్ మరింతగా పెరిగే అవకాశం వుంది. అయితే ఇక్కడే `విరాటపర్వం`కు మంచి అడ్వాంటేజ్ లభించింది. ఈ మూవీ తరువాత ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. జూలై ఒకటి వరకు ఎలాంటి పెద్ద సినిమా ఈ మూవీకి పోటీగా రావడం లేదు. రెండు వారాల పాటు ఈ సినిమాకు మంచి టైమ్ లభించబోతోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని `విరాటపర్వం` భారీ వసూళ్లని రాబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.