Begin typing your search above and press return to search.
డబ్బింగ్ రైట్స్ కి లెక్కలేకుండా పోతోందా...?
By: Tupaki Desk | 11 Sep 2020 12:30 AM GMTనేచురల్ స్టార్ నాని - సుధీర్‌బాబు హీరోలుగా నటించిన 'వి' సినిమా ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మించారు. నివేదా థామస్ - అదితిరావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ''వి'' పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆరు నెలలు థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేసిన మేకర్స్ చివరకి ఓటీటీకే ఓటు వేశారు.
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వారు 'వి' సినిమాని రూ.30 నుంచి 35 కోట్ల మధ్య డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5న తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అయిన 'వి' మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. నాని కెరీర్లో మైలురాయి సినిమా ఇలా ఉంటుందని ఎక్సపెక్ట్ చేయలేదని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే దిల్ రాజుకు నష్టాలు తెచ్చి పెట్టేదని కామెంట్స్ వినిపించాయి. ఓటీటీ పుణ్యమా అని లాభాల బాట పట్టిన 'వి' సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ సుమారు రూ.8 కోట్లకు అమ్ముడుపోయాయట.
ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కూడా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.8 కోట్ల డీల్ జరిగినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఓటీటీలో ఎక్కువ ఆదరణ దక్కించుకోని సినిమా రీమేక్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడం ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోందట. లాక్ డౌన్ లో కూడా రిపీట్ వ్యూస్ లేని సినిమాలకు ఇంత క్రేజ్ ఏంటని ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కరోనా లాక్ డౌన్ లో డబ్బింగ్ రైట్స్ కి లెక్కలేకుండా పోతోందని కామెంట్స్ చేస్తున్నారు.