Begin typing your search above and press return to search.
స్నీక్ పీక్: గోపీకి అంత బడ్జెట్
By: Tupaki Desk | 23 Jan 2019 5:00 AM GMTఇండో-పాక్ బోర్డర్ సినిమా అంటూ గోపీచంద్ హీరోగా జైసల్మేర్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 50 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్ , న్యూ ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. దీనికి తమిళంలో విశాల్ తో యాక్షన్ చిత్రాల్ని తెరకెక్కించిన తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పేరుకు నిర్మాత సుంకర రామబ్రహ్మం అయినా పెత్తనం మొత్తం అనిల్ సుంకరదే. ఆయన ఏ సినిమా చేసినా రిలీజ్ కు ముందు ఆర్భాటం తప్ప పబ్లిసిటీ అంతంత మాత్రమే.
అదంతా సరే... గోపీచంద్ బడ్జెట్ చూస్తేనే వామ్మోవ్ అనకుండా ఉండలేరట! ఈ చిత్రం కోసం ఏకంగా 35 కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. గోపీచంద్ మార్కెట్ కు అంత పెడితే తిరిగి వస్తుందా? అన్నది ఓ ప్రశ్న. గతంలో భగవాన్, పుల్లారావు కలిసి సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా `గౌతమ్‌నంద` చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ఎంత చెప్పినా సంపత్ వినకుండా ఈ చిత్రానికి ఏకంగా 32 కోట్ల ఖర్చు చేయించాడు. ఫలితం ఈ సినిమా పబ్లిసిటీకి కూడా నిర్మాతల దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఎదురైందని చెప్పుకున్నారు. రిలీజైన తరువాత కూడా సినిమా ద్వారా భారీ గానే నష్టపోయారు.
ఇక అనిల్ సుంకర గతానుభవాలు తక్కువగా ఏం లేవ్! `యాక్షన్ 3డి`, `కిరాక్ పార్టీ` వంటి చిత్రాలు భారీ బడ్జెట్ల వల్ల, అదుపు తప్పిన బడ్జెట్ల వల్ల నష్టాలను మిగిల్చాయి. అందుకే ఇప్పుడు గోపీచంద్ సినిమాకు 35 కోట్లు ఏ ధైర్యంతో ఖర్చుపెడుతున్నారో అర్థం కావడం లేదని ట్రేడ్ ప్రశ్నిస్తోందిట. వరుస ఫ్లాపుల్లో వున్న గోపీచంద్ తో 35 కోట్ల బడ్జెట్‌తో అనిల్ సుంకర జూదం ఆడుతున్నారా? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సెటైర్లను చూసైనా అనిల్ సుంకర జాగ్రత్తపడతారా.. అన్న శేష ప్రశ్న అలానే మిగిలి ఉంది. కాస్ట్ ఫెయిల్యూర్ విషయంలో ముందుగానే జాగ్రత్త పడడం అన్నది నిర్మాతలకు మేలే కదా? అన్న మాటా వినిపిస్తోంది.