Begin typing your search above and press return to search.
మళ్లీ భారీ బడ్జెట్ అంటున్నాడే..
By: Tupaki Desk | 3 May 2018 5:30 PM GMTక్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు గుణశేఖర్. స్పెషల్ గా సెట్స్ వేసి కథను అందులో భాగం చేయడం ఆయన ప్రత్యేకత. ఈ విషయం అందరికి తెలిసిందే. కళా దర్శకులను వాడుకోవడంలో గుణశేఖర్ తరువాతే ఎవరైనా అనేలా తన ఎన్నో సినిమాలతో నిరూపించాడు. ఇకపోతే ఆయన గత కొంత కాలంగా సరైన హిట్ కోసం శ్రమిస్తున్నారు. అనుష్కతో రుద్రమదేవి తీసినప్పటికి అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.
పెట్టిన బడ్జెట్ వరకు ఆయన సేఫ్ జోన్ లో ఉండే విధంగా ఆ సినిమా హెల్ప్ చేసింది. ఇకపోతే నెక్స్ట్ ఆయన దృష్టి మొత్తం ఒక పౌరాణిక చిత్రంపైనే ఉంది. కృష్ణ బాగవాణుడితో పోరాడిన హిరణ్యకశిప పాత్రను బేస్ చెసుకొని ఒక మంచి కథను సెట్ చేసుకున్నారట. రానా ఆ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం కూడా గుణశేఖర్ బడ్జెట్ గట్టిగానే పెడుతున్నట్లు తెలుస్తోంది. సెట్స్ ప్రధానాంశంగా దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడానికి సన్నహకాలు చేస్తున్నాడు. దాదాపు ప్లాన్ మొత్తం పూర్తయినట్లు సమాచారం.
ప్రస్తుతం గుణశేఖర్ తన డైరెక్షన్ డిపార్ట్ మెంట్ తో మరికొంత కథను రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం భారీ సెట్స్ వేస్తేనే ఒక పౌరాణిక చిత్రం చూసిన విధంగా ఫీల్ కలుగుతుంది. అలాగే సినిమా కథ విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా డిమాండ్ చేస్తుంది కాబట్టి ఈజీగా 100 కోట్లు క్రాస్ అవుతుంది. గుణ శేఖర్ ఈ చిత్రాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాడు. సమయం ఎక్కువ తీసుకున్నా సరే మంచి చిత్రాన్ని ఇవ్వాలని వర్క్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.