Begin typing your search above and press return to search.
రానా కోసం ఇంత ఖర్చా ?
By: Tupaki Desk | 24 March 2019 8:47 AM GMTలీడర్ తో హీరోగా పరిచయమైనా బాబాయ్ లాగా స్టార్ డం కోసం ప్రయత్నించకుండా ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న రానాకు ఎన్టీఆర్ మహానాయకుడు ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. చంద్రబాబు పాత్ర మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ పెర్ఫార్మన్స్ పరంగా కూడా రానాకు ఆశించిన గుర్తింపు రాలేదు.
ఇదిలా ఉండగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన ఖాతాలో ఉంచుకున్న రానా త్వరలో హిరణ్యకశిపగా రానున్నాడు. రుద్రమదేవి టైంలోనే దీన్ని ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్ స్క్రిప్ట్ ని ఒక కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. సురేష్ బాబుతో పాటు గుణ స్వీయ నిర్మాణంలో సుమారు 180 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందనున్నట్టు వినికిడి.
రానా మార్కెట్ కు ఇది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ సబ్జెక్ట్ యునివర్సల్ కావడంతో వర్క్ అవుట్ అవుతుందనే ధీమాలో ఉంది టీమ్.ఇకపోతే ఇందులో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిసింది. ఓ 15 కంపెనీలకు వివిధ రకాల బాధ్యతలు అప్పగించి నెవెర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా అనే రేంజ్ లో తీర్చిదిద్దేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
ఇప్పటిదాకా బాహుబలి స్థాయి మేకింగ్ ఇంకే సినిమాలో కనిపించలేదు. సైరా మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. హిరణ్యకశిప పూర్తయ్యే సమయానికి వీటికి చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి వాటిని మించే రేంజ్ లో దీన్ని తీర్చిదిద్ది రానా కెరీర్లో అల్ టైం బెస్ట్ మూవీగా ప్లాన్ చేస్తున్నారట. మల్టీ స్టారర్ గా రూపొందబోయే ఈ మూవీలో ఇతర ఆర్టిస్టులు టెక్నీకల్ టీమ్ జూన్ లో ప్రారంభోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉంది