Begin typing your search above and press return to search.
సరిలేరు.. సెట్స్ కోసమే అంత భారీ ఖర్చు
By: Tupaki Desk | 6 July 2019 4:46 AM GMTసూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 26వ సినిమా `సరి లేరు నీకెవ్వరు`. ఎఫ్ 2 ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ లోని మాస్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తూ దూకుడు (అనీల్ రావిపూడి రచయిత) తరహాలో హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ని అనీల్ రావిపూడి ప్లాన్ చేశారు. ఈసారి మిలటరీ బ్యాక్ డ్రాప్ కి గ్రామీణ నేపథ్యాన్ని జోడించి నవ్యపంథా కథాంశాన్ని రూపొందించారట. మహేష్ లోని ఫన్ యాంగిల్ టెన్ టైమ్స్ హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో నటిస్తారని ప్రచారమవుతోంది. అయితే అత్త పాత్ర కాదని.. మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నానని లేడీ బాస్ ఇప్పటికే వెల్లడించారు.
ప్రస్తుతం మహేష్ కశ్మీర్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అతడు అక్కడ చిత్రయూనిట్ తో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మిలటరీ నేపథ్యంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్లు తెరకెక్కిస్తారు. అటుపై చిత్ర బృందం హైదరాబాద్ కి తిరిగి వస్తుంది. ఇక్కడికి రాగానే అన్న పూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన ట్రెయిన్ సెట్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఇందులో మహేష్- రష్మిక- రాజేంద్ర ప్రసాద్ - బండ్ల గణేష్ బృందంపై హిలేరియస్ కామెడీ సీన్స్ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కేవలం ఈ ట్రెయిన్ సెట్ లో కొన్ని నిమిషాల పాటు లెంగ్తీ గా సాగే సీన్స్ తెరకెక్కించాల్సి ఉంది. అటుపైనా విజయశాంతి ఇంట్లో సన్నివేశాల చిత్రీకరణ కూడా ఉంటుందట. అయితే ఈ రెండు సెట్ల కోసం భారీ బడ్జెట్ ని వెచ్చించడం చర్చకు వచ్చింది.
ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రెయిన్ సెట్ కోసం 2-3 కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే రెండోది విజయశాంతి హౌస్ సెట్ ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 2కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సెట్ల నిర్మాణం సాగుతోంది. కశ్మీర్ షెడ్యూల్ పూర్తి కాగానే ఈ సెట్స్ లో ప్రధాన తారాగణంపై సీన్లు తెరకెక్కిస్తారట. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది.