Begin typing your search above and press return to search.

అమ్మ దెబ్బకు సిరి డ్రెస్సింగ్ లో భారీ మార్పు

By:  Tupaki Desk   |   27 Nov 2021 4:07 AM GMT
అమ్మ దెబ్బకు సిరి డ్రెస్సింగ్ లో భారీ మార్పు
X
బిగ్ బాస్ లో మరో వారం ముగియనుంది. ఇవాళ.. రేపటి (శని..ఆదివారాలు)తో మరో వారం ముగియటమే కాదు.. విజేతను ప్రకటించే టైం దగ్గరకు వచ్చేసింది. ఈ వారం మొదట్లో కెప్టెన్సీ టాస్కు పూర్తి అయిన తర్వాత నుంచి హౌస మేట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు రావటం తెలిసిందే.

దీంతో.. బిగ్ బాస్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. శుక్రవారం రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ తో అందరి ఫ్యామిలీ మెంబర్లు రావటం పూర్తైంది. తొలుత కాజల్ భర్త.. కుమార్తె రాగా.. చివరగా షణ్ముఖ్ అమ్మ వచ్చారు.

కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కారణంగా తెగ ఇబ్బందికి గురైంది ఎవరైనా ఉన్నారంటే అది సిరినే అవుతుంది. ఆమె తల్లి రావటంతోనే.. హగ్ లు చేసుకుంటున్న తీరు నచ్చటం లేదని కుండబద్ధలు కొట్టేశారు. షణ్ముఖ్ ను తండ్రి.. సోదరుడు.. స్నేహితుడు అంటూ చెప్పేసిన వైనానికి తెగ ఇబ్బంది పడిన పరిస్థితి. సిరి సైతం.. తల్లి మాటలకు కాస్తంత కోపానికి గురై.. అందరి ముందు అలా చెప్పేస్తే ఎలా? అన్నప్పటికీ సిరి తల్లి మాత్రం తాను చెప్పాల్సింది చెప్పేశారే తప్పించి.. వెనక్కి తగ్గలేదు.

షణ్ముఖ్ అమ్మ సైతం సిరితో తన కొడుకు తీరును పాలీష్డ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆటను ఆటలా తీసుకోవాలే కానీ.. ఎమోషనల్ కాకూడదని సలహా ఇచ్చారు. ఆ మాటకు వస్తే.. షణ్ముఖ్ - సిరి ఎపిసోడ్ కు సంబంధించిన ఆమె ఎంతలా ఉన్నారన్న విషయం.. ఆమె మాటల్లోనూ.. ఆమె కళ్లల్లోనూ కొట్టొచ్చినట్లుగా కనిపించింది. బిగ్ బాస్ హౌస్ కు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఇంటి సభ్యుల్లో భారీ మార్పు ఏమైనా వచ్చిందంటే అది సిరిలోనే అని చెప్పాలి.

గతం కంటే కాస్త డల్ గా ఉండటం.. అప్పుడప్పుడు తీవ్రమైన ఎమోషన్ కు గురి కావటమే కాదు.. ఆమె డ్రెస్సింగ్ లోనూ తేడా వచ్చేసింది. సింఫుల్ గా తయారు కావటం.. ఎప్పుడూ లేనిది.. ఆమె ధరించే దుస్తులకు ఏ మాత్రం సూట్ కాకున్నా.. చున్నీ వేసుకోవటం.. అలానే కంటిన్యూ కావటం కనిపించింది.

ఆ హగ్గులు ఏమిటని తల్లి పలు మార్లు చెప్పి వెళ్లిన తర్వాత కూడా బిగువైన హగ్ చేసుకుంది షణ్ముఖ్. అయితే.. అందుకు స్పందించని షణ్ను.. అలానే ఉండిపోయాడు. తర్వాత నుంచి మాత్రం సిరి కాస్త దూరంగా ఉండటం కనిపించింది. కుటుంబ సభ్యులు బిగ్ బాస్ ఇంటికి వచ్చి వెళ్లిన ఎపిసోడ్లను చూసినప్పుడు.. అత్యంత ఎమోషనల్ గా అనిపించింది రవి భార్య.. కుమార్తె అయితే.. కాస్తంత గంభీరంగా సాగింది మాత్రం సిరి తల్లి వచ్చిన ఎపిసోడ్. ఆ తర్వాతి స్థానంలో షణ్ముఖ్ అమ్మ వచ్చిన సమయంలోనూ వాతావరణం కాస్తంత గంభీరంగానే సాగింది.

ఇక.. కాజల్ భర్త.. కమార్తె వచ్చిన సందర్బంలో.. మిగిలిన వారికి భిన్నంగా వ్యూహాల గురించి చర్చ సాగింది. ప్రియాంక బంధువు వచ్చిన సందర్భంలో మాత్రం.. కన్ఫ్యూజింగ్ గా.. మానస్ కు పదే పదే సారీ చెప్పటం కనిపించింది. ఇక.. బిగ్ బాస్ ఇల్లు మొత్తం సందడిగా మార్చిన ఘనత మాత్రం సన్నీ తల్లిదేనని చెప్పాలి.

మానస్ తల్లి వచ్చినప్పుడు వాతావరణంలో మార్పు వచ్చినా.. వీక్షకుల్లో అంత ప్రభావితం చేయలేదనే చెప్పాలి. ఇక.. శ్రీరామచంద్ర సోదరి వచ్చిన ఎపిసోడ్ క్యూట్ గా ఉన్నప్పటికీ.. ఎఫెక్టు మాత్రం అంతంత మాత్రమేనని చెప్పక తప్పదు.