Begin typing your search above and press return to search.

'పుష్ప 2' అందుకే ఆలస్యమవుతోందా..?

By:  Tupaki Desk   |   29 Jun 2022 3:30 AM GMT
పుష్ప 2 అందుకే ఆలస్యమవుతోందా..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ''పుష్ప''. శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.  తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా నార్త్ సర్క్యూట్ లో ఈ సినిమా ఊహించని వసూళ్లను అందుకుని అందరికీ ఆశ్చర్యపరిచింది. దీంతో 'పుష్ప 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'పుష్ప: ది రైజ్' సినిమాకు కొంసాగింపుగా 'పుష్ప: ది రూల్' ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్-1 వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా.. ఇంతవరకు రెండో భాగం సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారనే విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

నిజానికి 'పుష్ప' సెకండ్ పార్ట్ ను వీలైనంత తొందరగా సెట్స్ మీదకు తీసుకొచ్చి.. ఈ ఏడాదిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి.. డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ అప్పుడే రెండో భాగానికి సంబంధించిన కొంతభాగం షూట్ చేసి ఉండటంతో.. మేకర్స్ ప్లాన్ చేసినట్లుగానే అన్నీ జరుగుతాయని అందరూ భావించారు.

అయితే 'పుష్ప 1' సినిమా ఊహించని దానికంటే బ్లాక్ బస్టర్ అవడం.. రెండో పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడటంతో మేకర్స్ ఆ ప్రణాళికలను మార్చుకున్నారని తెలుస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా రెడీ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని.. మొదటి భాగాన్ని మించిన బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు ముందుగా అనుకున్న స్క్రిప్టుకు అదనంగా కొన్ని హంగులు అద్దుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే షూట్ చేసిన సన్నివేశాలను మరింత గ్రాండ్ గా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ సైతం 'పుష్ప 2' ని భారీ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారని.. దీని కోసం సుక్కూ మరి కొంత సమయం ఎక్కువ కావాలని అడిగారని అంటున్నారు.

'పుష్ప-1' చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' పై క్రేజ్ దృష్ట్యా 400 కోట్లకు పైగా ఖర్చు చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారట. సెట్స్ మీదకు వెళ్లకుండానే ఇప్పటికే బిజినెస్ చర్చలు కూడా మొదలయ్యాయని.. కొంతమంది అడ్వాన్సులు కూడా ఇస్తున్నట్లు టాక్.

'పుష్ప: ది రైజ్' షూటింగ్ ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ లేట్ అయితే మాత్రం ఈ మూవీ వచ్చేది 2024 లోనే.

కాగా, 'పుష్ప: ది రూల్' సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. సునీల్ - రావు రమేష్ - అజయ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చానున్నారు.