Begin typing your search above and press return to search.
'గాడ్ ఫాదర్' లో భారీ మార్పులు..ఫ్యాన్స్ కి పండగే!
By: Tupaki Desk | 4 Oct 2022 2:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం యూనిట్ ప్రచారం పనుల్లో నిమగ్నమైంది. మలయాళంలో హిట్ అయిన 'లూసీఫర్' కి రీమేక్ గా రూపొందిన చిత్రమిది. అక్కడ బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి.
దీనికితోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం సినిమాపై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్..లూసీఫర్ మార్పులు గురించి దర్శకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. 'గాడ్ పాదర్' స్ర్కీన్ ప్లే.. కొత్తగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు గెలుస్తాయి.
మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్ని సర్ ప్రజింగ్ అనిపిస్తాయి. ఓపిక ఉంటే లూసీఫర్ రీమేక్ చూసి రావొచ్చని దర్శకుడు ధీమా వ్యక్తం చేసారు. డైరెక్టర్ మాటల్ని బట్టి గాడ్ ఫాదర్ పై చాలా నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అలాగే కథ..హీరో పాత్ర పరంగా భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు నేటివిటీ..చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు పూర్తి స్థాయిలో భారీ మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. చిరంజీవి సపోర్టింగ్ రోల్స్ అదే తీరున సినిమాలో హైలైట్ చేసినట్లు కనిపిస్తుంది. తెలుగు సినిమాలో హీరో-విలన్ సమ ఉజ్జీగా తలడటం చాలా రేర్. ఆ విషయంలో ఇప్పుడిప్పుడే మేకర్స్ సహా ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి.
మలయాళంలో వీలైనంత రియల్ స్టిక్ గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో హీరో పాత్రని తగ్గించడానికి ఛాన్స్ ఉంది. మరి దర్శకుడి మాటల్ని బట్టి గాడ్ ఫాదర్ కథ పరంగా..హీరో పాత్ర పరంగా భారీ మార్పులే చేసినట్లు కనిపిస్తుంది. రెండు సినిమాలకు ఏమాత్రం పొంతన లేకుండా ఓ ప్రెష్ కథనే అందిస్తున్నట్లు దర్శకుడి మాటల్ని బట్టి అంచనా వేస్తున్నారు.
ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగే. మెగా మాస్ అభిమానులకు చిరంజీవి పాత్రని ఎంత లేపితే అంత సంతోషిస్తారు. ఫ్యాన్ బేస్డ్ ఇండస్ర్టీ కాబట్టి ఇక్కడ హీరోల్ని కచ్చితంగా లేపాలి. మోహన్ రాజా వ్యాఖ్యల్ని బట్టి చిరంజీవి పాత్ర ని భారీగానే పైకి లేపే ఉంటారు. చిరు గత సినిమా ఫలితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన చిత్రం కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు ఇక్కడ తప్పనిసరిగా భావించాల్సిందే. మరి 'గాడ్ పాదర్' ఎలా ఉంటుందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.