Begin typing your search above and press return to search.
పోటీ యమా స్ట్రాంగ్ గురూ!!
By: Tupaki Desk | 12 Oct 2018 7:17 AM GMTదసరా సంబరాలను జూనియర్ ఎన్టీఆర్ వారం ముందుగానే గ్రాండ్ గా మొదలుపెట్టేసాడు. ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పడం తొందరపాటు అవుతుంది కాని వసూళ్ళ ప్రభంజనం చూస్తుంటే మాత్రం గట్టి హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. సెలవులు మొన్నటి నుంచే ప్రారంభం కావడం వేరే ఆప్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లేకపోవడం లాంటివన్నీ కలిసి వస్తున్నాయి. ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్ తన కెరీర్ బెస్ట్ అందుకున్నాడని ఇప్పటికే రిపోర్ట్స్ ఉన్నాయి.
ఇక దీని సంగతి అలా ఉంచితే అసలైన పండగ రోజు అంటే అక్టోబర్ 18న రానున్న హలో గురు ప్రేమ కోసమేకు అగ్ని పరీక్షే ఉంది. ఇప్పటికే ఆడియోతో పాటు ట్రైలర్ విడుదలైపోయాయి. దేనికీ భీభత్సమైన రెస్పాన్స్ అయితే రాలేదు. డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా అనిపించింది తప్ప మిగిలినదంతా రొటీన్ వ్యవహారమే అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే నేను లోకల్ తరహాలోనే ఇది కూడా హిట్ అవుతుందనే నమ్మకం దిల్ రాజుది.
ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవకు హలో గురు ప్రేమ కోసమే కు ఉన్న గ్యాప్ 7 రోజులే. కేవలం వారానికే లగేజ్ సర్దేలా కనిపించడం లేదు యంగ్ టైగర్. ఇప్పుడున్న టాక్ కొనసాగితే మూడు వారాల దాకా ఈ జోరు తగ్గదు. మరి రామ్ పోతినేని తారక్ తో ఫైట్ చేసేంత సీన్ ఉందని చెప్పలేం కాని గట్టి పోటీని ఎదుర్కోవడం ఖాయం. అదే రోజు విశాల్ ఊర మాస్ పందెం కోడి 2తో వస్తున్నాడు. ఇదీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీనే. వరలక్ష్మి శరత్ కుమార్ విలనీ కీర్తి సురేష్ గ్లామర్ లింగుస్వామి మాస్ టేకింగ్ ఏదైనా షాక్ ఇచ్చినా ఇవ్వొచ్చు.
సో రెండు కత్తి నరుకుళ్ళు సినిమాల మధ్య రామ్ తన సాఫ్ట్ ఎంటర్ టైనర్ హలో గురు ప్రేమ కోసమేను గెలిపించుకోవాల్సి ఉంది. గత ఏడాది ఉన్నదీ ఒకటే జిందగీ పరాజయం తర్వాత రామ్ మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఇంత టైట్ కాంపిటేషన్ లో గెలవడం అంత సులభంగా అయితే కనిపించడం లేదు.