Begin typing your search above and press return to search.
సరిహద్దులు దాటినా AR రెహమాన్ కి అదే క్రేజు
By: Tupaki Desk | 29 Jun 2021 5:33 AM GMTఫ్లాష్ మాబ్ అనే సంస్కృతి విదేశాలతో పాటు స్వదేశంలోనూ ఇటీవల పాపులరవుతున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ప్లేస్ లో ఓ చోట గుమిగూడి ప్రజలంతా ఏదైనా మ్యూజిక్ కి డ్యాన్స్ చేయడాన్ని ఫ్లాష్ మాబ్ అని చెప్పాలి. తాజాగా స్వరమాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
డెన్మార్క్- కోపెన్ హాగన్ లోని ప్రజలు ఇలా ఫ్లాష్ మాబ్ లో పాల్గొన్నారు. ఆసక్తికరంగా ఇది రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ మూవీ శివాజీ (2007) నుండి బల్లెలక్క పాట.. డెన్మార్క్ ప్రజలు ఊగిపోతూ ఆలపించారు. ఈ పాటను కోపెన్ హాగన్ వీధుల్లో గాయక బృందం ఒపెరా తరహాలో పాడింది. వందలాదిగా ప్రజలు ఈ స్వరానికి డ్యాన్సులాడారు.
ఈ పాటను ఆలపించింది లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని రెహమాన్ గుర్తు చేయడం ఆసక్తికరం. ప్లేబ్యాక్ సింగర్ కీ.శే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హ్యాష్ ట్యాగ్ ను ఆయన జోడించి ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో .. రెహమాన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తండ్రి పాట సరిహద్దులను దాటినందుకు రెహమాన్ వారసుడు అమీన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Ballailaka at #Copenhagen#flashmobchoir @rajinikanth #nayanthara #spbalasubramaniam #raihannashekhar @shankarshanmugh
— A.R.Rahman #99Songs
Thank you @ShakthiGalatta pic.twitter.com/6yI2s78Jb1