Begin typing your search above and press return to search.
ఇంత క్రేజ్..సావిత్రమ్మకు మాత్రమే సొంతం బాస్!
By: Tupaki Desk | 9 May 2018 4:58 AM GMTఅగ్రహీరోలు లేరు. ఆ మాటకు వస్తే మేల్ డామినేటెడ్ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఫిమేల్ చుట్టూ తిరిగే మూవీకి ఇంత క్రేజ్ గతంలో ఎప్పుడూ లేదేమో. అప్పుడెప్పుడో బ్లాక్ వైట్ కాలంలో వెండితెర వేల్పు అయిన ఒక నటి బయోపిక్ కు ఒక భారీ చిత్రానికి ఎలాంటి క్రేజ్ వస్తుందో.. అంతటి క్రేజ్ రావటం అంటే.. అది సావిత్రికి మాత్రమే సాధ్యమేమో?
తెలుగు సినిమా ఎన్ని మజిలీలను దాటినా.. సావిత్రి ఫేజ్ ను తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకుడు అస్సలు మర్చిపోరన్న వైనం మహానటి మూవీతో మరోసారి రుజువైందని చెప్పాలి.
మహానటి సావిత్రి జీవితచరిత్రను సినిమాగా తీసిన మూవీ ఈ రోజు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పట్ల ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకుడు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.ఈ మూవీ ఎలా ఉంటుందన్న దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఆగ్రతారలంతా తమకున్న క్రేజ్ ను పక్కన పెట్టేసి మరీ నటించటం విశేషం. ఆ మాటకు వస్తే సావిత్రి మీద ఉన్న అపారమైన గౌరవంగా చెప్పక తప్పదు.
సమంత లాంటి అగ్రనటి.. ఒక చిన్న పాత్రను పోషించటమా? అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో వచ్చిన క్రేజ్ ను.. పేరు ప్రఖ్యాతుల్ని పక్కన పెట్టేసి ఒక చిన్న పాత్రను పోషించేందుకు ఓకే చెప్పటం అంటే అది సావిత్రి బయోపిక్ వల్లనే తప్పించి మరొకటి కాదేమో?
సరిగ్గా వారం మధ్యలో విడుదల అవుతున్న మహానటిని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు రెఢీ అయిపోతున్న తీరు.. టికెట్స్ ఫిల్ అవుతున్న తీరు చూస్తే.. తెలుగోళ్లకు సావిత్రికి మధ్యనున్న అనుబంధం ఎలాంటిదో ఇట్టే అర్థం కాక మానదు. అందుకే చెబుతున్నాం.. ఇలాంటివి సావిత్రికి మాత్రమే సాధ్యం. మరెవరికీ ఆ దగ్గరకు వచ్చే సత్తా లేదని చెప్పక తప్పదు. ఇప్పుడే కాదు.. మరెప్పుడైనా సరే..