Begin typing your search above and press return to search.
బాహుబలి బొమ్మలకు భలే గిరాకీ
By: Tupaki Desk | 15 Jun 2017 11:58 AM ISTబాహుబలి సిరీస్ సాధించిన అసామాన్యం అనాల్సిందే. బాహుబలి మూవీ పూర్తయిపోయినా.. ఆ శకం మాత్రం ఇప్పట్లో అయిపోయే అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని పుస్తకాలు వచ్చేస్తుండగా.. ఇప్పుడు దేవసేన ప్రధాన పాత్రగా సీరియల్ కూడా సిద్ధమయిపోతోంది. మరోవైపు బాహుబలి బొమ్మల హంగామా మొదలైపోయింది.
హాలీవుడ్ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోలతో బొమ్మలు తయారు చేయడం.. వాటిని మాల్స్ లో.. టాయ్ స్టోర్స్ లో విక్రయించడం అనే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. ఇండియన్ సూపర్ హీరోస్ కు ఇలాంటి గౌరవం ఇప్పటివరకూ దక్కలేదు. విశాఖకు చెందిన ఉదయ్ అనే చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ డైరెక్టర్.. ఈ విషయంపై ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. 'మన సూపర్ హీరోల బొమ్మలు ఎందుకు కనిపించవు అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా అనిపించేంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150కి ముందు చింరజీవి గారి ప్రోటోటైప్ బొమ్మలను సిద్ధం చేశాం. కానీ ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు. చివరకు బాహుబలి ద్వారా మా ఆలోచన ఫలించింది' అన్నాడు ఉదయ్.
ఈ బొమ్మల తయారీ కోసం యూఎస్.. కెనడాలకు కూడా తిరగానన్న ఉదయ్.. అక్కడి మేకింగ్ ఛార్జీల కారణంగా గిట్టుబాటు కాదనే విషయం తెలుసుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత చైనా నుంచి అత్యంత క్వాలిటీతో తక్కువ ధరలకే బొమ్మలను తెచ్చుకుంటున్నామని.. ఏప్రిల్ 24 నుంచి బాహుబలి.. భళ్లాలదేవ పాత్ర విగ్రహాలను విక్రయిస్తున్నట్లు చెప్పాడు. తొలి రోజునుంచే రెస్పాన్స్ సూపర్బ్ గా ఉండగా.. అమెజాన్ లో విక్రయం అవుతున్న ఈ బొమ్మలకు.. నార్త్ ఇండియా నుంచి ఫ్రాన్స్.. జర్మనీ.. న్యూయార్క్ ల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నట్లు చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/