Begin typing your search above and press return to search.
అందరికీ డిసెంబర్ 21.. 22 డేట్లే కావాలట!
By: Tupaki Desk | 9 Oct 2019 2:30 PM GMTదసరా సీజన్ ముగిసింది కాబట్టి సినిమా రిలీజులకు నెక్స్ట్ చెప్పుకోదగ్గ సీజన్ క్రిస్మస్ సీజనే. సంక్రాంతి సీజన్ లో పెద్ద స్టార్ల సినిమాలు పోటీ పడతాయి కాబట్టి మీడియం రేంజ్ సినిమాల మేకర్లు క్రిస్మస్ పైనే కన్నేశారు. డిసెంబర్ 20 నుంచి 25 వరకూ రిలీజ్ చేసేందుకు దాదాపు ఆరేడు సినిమాలు లైన్లో ఉన్నాయి.
రవితేజ 'డిస్కోరాజా'.. సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే'.. నితిన్ 'భీష్మ' సినిమాలు క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అనుష్క సినిమా 'నిశ్శబ్దం' కూడా డిసెంబర్ రిలీజ్ అంటున్నారు కానీ క్రిస్మస్ వీకెండ్ లోనా కాదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇవి కాకుండా నందమూరి బాలకృష్ణ-కె యస్ రవి కుమార్ల తాజా చిత్రం కూడా ఈ సీజన్లోనే రిలీజ్ కానుందని టాక్. అయితే అధికారిక సమాచారం రాలేదు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఈ క్రిస్మస్ టార్గెట్ పెట్టుకున్నాయట.
నిజానికి ఓవర్సీస్ లో క్రిస్మస్ పెద్ద సీజన్. థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ తో మొదలై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకూ ఫుల్ హంగామా ఉంటుంది. మనకు ఇక్కడ అన్ని రోజులు హాలిడేస్ ఉండవు కానీ మన నిర్మాతలు ఓవర్సీస్ కలెక్షన్స్ పై ఫోకస్ చేస్తూ ఇక్కడ లోకల్ మార్కెట్ లో కలెక్షన్స్ గురించి పెద్దగా ఆలోచించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ఇక్కడ ఇలాంటి పోటీలో రిలీజ్ అయితే థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు తప్పవు. మరి ఏం చేస్తారో వేచి చూడాలి.