Begin typing your search above and press return to search.
కెజిఎఫ్ హీరో మాస్టర్ పీస్ కి డిమాండ్
By: Tupaki Desk | 5 Feb 2019 4:27 AM GMTగత ఏడాది డిసెంబర్ మూడో వారం వరకు కన్నడ హీరో యష్ అంటే తొంభై శాతం తెలుగు సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మొహమే . కెజిఎఫ్ వచ్చాక అనూహ్యంగా ఈ లెక్క మారిపోయింది. యష్ హాట్ కేకుగా మారిపోయాడు. డిసెంబర్ 21న విడుదలైన ఈ డబ్బింగ్ వండర్ హైదరాబాద్ లాంటి నగరాలు మొదలుకుని కర్నూల్ లాంటి జిల్లా కేంద్రాల్లో ఇంకా నాలుగు ఆటలతో ప్రదర్శింపబడుతోంది అంటే సామాన్యమా. రజని అంతటి సూపర్ స్టార్ నటించిన 2.0 పట్టుమని నెల రోజులు ఆడలేక డీలా పడిపోయంది. అలాంటిది కెజిఎఫ్ కు ఈ రన్ అంటే చిన్న విషయం కాదు.
ఇప్పుడు దీని పుణ్యమా అని యష్ నటించిన వెనుకటి కన్నడ సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. వీటి డబ్బింగ్ హక్కులు కొనేసి నాలుగు రాళ్ళు వెనకేసుకుని లాభాలు చేసుకునే ఉద్దేశంతో కొందరు నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. అందులో ముఖ్యంగా వీళ్ళ కన్ను రెండు సినిమాల మీద ఉంది. ఒకటి సినిమా పేరే మాస్టర్ పీస్. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్. మాస్ కి నచ్చే అన్ని అంశాలు పుష్కలంగా ఇందులో ఉంటాయి. అదనంగా యష్ డాన్సింగ్ స్కిల్స్ కూడా చూడొచ్చు. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో చాలానే ఉన్నాయి.
మరో సినిమా మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి. ఇదీ కెజిఎఫ్ కన్నా ముందు నిలిచిన శాండల్ వుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి. ఆ టైంలో దీన్ని చూసిన టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు రామ్ చరణ్ తో రీమేక్ చేయాలనీ చాలా ట్రై చేసారు. కాని ఎందుకో అది ఆలోచన దశలోనే ఆగిపోయింది. ఇప్పుడు కనక వీటిని తెలుగులో డబ్ చేసుకుంటే ఎంతో కొంత వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే డిమాండ్ ను గమనించిన ఒరిజినల్ నిర్మాతలు కాస్త పెద్ద మొత్తమే ఆశిస్తున్నారట. అందుకే డీల్స్ కొలిక్కి రావడం లేదని బెంగుళూరు రిపోర్ట్