Begin typing your search above and press return to search.
సెట్టింగుల ఆదాయం ఇలా కూడానా?
By: Tupaki Desk | 27 Jan 2019 1:30 AM GMTసెట్టింగులు వేస్తే ఇలా కూడా కలిసొస్తుందా? ఓ వైపు నిర్మాత జేబుల్ని ఖాళీ చేయించేలా భారీ సెట్స్ వేయిస్తున్న దర్శకులపై విమర్శలు వస్తున్నా.. కాస్ట్ ఫెయిల్యూర్ కి భారీ సెట్లే కారణం అని సెటైర్లు పడుతున్నా.. సెట్టింగులు వేయడం తగ్గడం లేదేంటి చెప్మా! అంటూ అందరూ సందేహిస్తున్నారు. అయితే ఈ సందేహం వెనక సందేశం ఉందని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. భారీ సెట్ల వెనక ఓ తెలివైన గేమ్ ప్లాన్ కూడా రన్ అవుతోందని తెలిస్తే షాక్ తినరూ?
మన సెట్ డైరెక్టర్స్ - నిర్మాతలు ఇటీవలి కాలంలో తెలివిమీరిపోయారని తాజా సన్నివేశం చెబుతోంది. ఏదైనా భారీ సెట్ ని కోట్లకు కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారంటే దానికి చాలా ముందు నుంచే అద్భుతమైన డ్యూయల్ రెవెన్యూ రిటర్న్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉంటోందిట. ఆ సెట్ అవసరానికి ఉపయోగించుకున్నాక.. వెంటనే పడగొట్టేసేవారు ఇదివరకూ. అయితే ఇటీవల ప్లాన్ మారింది. అదే సెట్ ని వేరే సినిమాలు - సీరియళ్లు - టీవీ ప్రోగ్రామ్స్ కు సంబంధించి షూటింగులకు అప్పజెప్పితే.. రాయల్టీలు - రెంట్ లు - షేర్ లు అంటూ చాలానే రిటర్న్ మనీకి ఆస్కారం ఉంటోందిట.
గుణశేఖర్ టైమ్ లో సెట్లు వేస్తే ఆ ఒక్క సినిమాకే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు రామకృష్ణ- మైనిక టైమ్ నడుస్తోంది. నవతరం కళాదర్శకులు ప్రతిభావంతంగా సెట్లు వేయడమే కాదు. ఖర్చు లో మెజారిటీ భాగం రిటర్న్స్ వచ్చేలా డ్యూయల్ స్కీమ్ అప్లయ్ చేస్తున్నారట. అప్పట్లో మోహన్ బాబు `ఊకొడతారా ఉలిక్కిపడతారా` కోసం గంధర్వ మహల్ సెట్ ని వేసి - అటుపై ఇతర సినిమాలకు ఉపయోగించుకుని రెంట్లు రప్పించారట. అదే సెట్ ని బెల్లంకొండ ఉపయోగించుకుని డబ్బు కట్టకపోవడంతో గొడవైందని చెప్పుకున్నారు. ఇకపోతే అక్కినేనీ మల్టీస్టారర్ `మనం` సెట్ ని సోగ్గాడే చిన్ని నాయన, సుశాంత్ సినిమాలకు ఉపయోగించుకున్నారు. చివరిలో సెట్ తగలబడితే ఇన్సూరెన్స్ భారీగానే వచ్చిందని మాట్లాడుకున్నారు. దీనివల్ల డబ్బు ట్రిపుల్ రేంజులో రిటర్న్ దక్కిందిట. చరణ్ - సుకుమార్ `రంగస్థలం` సెట్ వల్ల ఇలానే కలిసొచ్చిందని చెప్పుకున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కోసం వేసిన సెట్ ని ఈటీవీ ప్రోగ్రామ్ స్వరాభిషేకం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, ఇతర సినిమాల షూటింగులు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇలా రెండోసారి ఉపయోగించేప్పుడు ప్రోగ్రామ్ కి అవసరమయ్యేలా సెట్ డిజైన్ ని మార్చుకుంటారంతే. దానికోసం చాలా తక్కువ ఖర్చు కూడా అవుతుందట. బిగ్ బాస్ సీజన్ 1 కోసం హిందీ బిగ్ బాస్ సెట్ ని ఉపయోగించుకున్నారు. ఇక ఇదొక్కటే కాదు లండన్ - బ్రిటన్ లొకేషన్లు - కొన్ని విదేశీ లొకేషన్లను ఉపయోగిస్తే రాయల్టీల రూపంలో టూరిజం విభాగంలో సగం సొమ్ములు వెనక్కి వచ్చేస్తాయని చెబుతుంటారు. మొత్తానికి ఇన్ ఫిలిం బ్రాండింగులా ఈ డ్యూయల్ ప్లానింగ్ బావుందనే చెప్పొచ్చు.