Begin typing your search above and press return to search.

హాట్ వైఫ్‌ ను నటించమని అడుగుతున్నారే

By:  Tupaki Desk   |   4 Aug 2017 2:18 PM GMT
హాట్ వైఫ్‌ ను నటించమని అడుగుతున్నారే
X
టాలీవుడ్ లో అసలు ఏ నటుడి భార్య కూడా సోషల్ సర్కిల్స్ లో పెద్దగా కనిపించిందే లేదు. ఎంతసేపూ మనోళ్లు హీరోలు మాత్రమే రావడం కాని వారి భార్యలు మాత్రం కనిపించరు. ఒకవేళ కొందరి స్టార్ల భార్యలు కనిపించినా కూడా.. వారు మాత్రం పెద్దగా హాటుగా ఉండరనే చెప్పాలి. ఎంతసేపు సాంప్రదాయం బద్దం అంటూ సెంటిమెంటుగా కనిపిస్తారు. కాని మోడ్రన్ యుగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొంతమంది భార్యామణులు బాలీవుడ్ భామల రేంజులో ఎంట్రీ ఇస్తున్నారులే.

క్యారక్టర్ఆర్టిస్ట్ అజయ్ ఉన్నాడు చూడండి.. అతని భార్య శ్వేత రావూరి మొన్నామధ్యన ఏకంగా 30 కేజీల వెయిట్ తగ్గిపోయి మిస్సెస్ ఇండియా కాంటెస్టులో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ అమ్మడు కిరీటం గెలవకపోయినప్పటికీ.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఐడెంటెటీ సంపాదించింది. ఆమె తన ఫిట్నెస్ గురించి చెబుతూ ఆ ఫోటోల్లో ఉన్నట్లు అలా హాటు హాటుగా కనిపిస్తుంటే.. ఎవరైనా కూడా వామ్మో అనాల్సిందే. మరి శ్వేత కిరీటం ఎందుకు గెలవలేకపోయిందో కాని.. టాలీవుడ్ వైఫ్స్ అందరికీలోకి హాటెస్ట్ అంటే ఆమె అనే చెప్పాలి.

ఇకపోతే బాలీవుడ్లో ఎలాగైతే షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ ను సినిమాల్లోకి రమ్మని చాలామంది అడుగుతున్నారో.. ఇక్కడ కూడా అజయ్ వైఫ్‌ శ్వేతను చాలామంది సినిమాలు చేయాల్సిందిగా కోరుతున్నారట. మరి ఆమె ఒప్పుకుంటుందా??