Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: మన కథలన్నీ కొట్టేస్తున్నారు!
By: Tupaki Desk | 28 Sep 2018 4:12 AM GMTకథల్లో విషయం ఉంటే అవి భాషతో సంబంధం లేకుండా దేశమంతా ప్రమోటవుతున్నాయి. ఒక భాషలో హిట్టయిన సినిమా కథని ఎంత పెద్ద మొత్తం ఇచ్చి అయినా ఛేజిక్కించుకుని రీమేక్ చేసేందుకు ఇరుగుపొరుగు భాషల్లో ఫిలింమేకర్స్ సిద్ధమవుతున్నారు. అలా టాలీవుడ్ కి ఎన్నో కథలు ఇరుగుపొరుగు పరిశ్రమల నుంచి వచ్చాయి. టాలీవుడ్ కథలెన్నో ఇరుగుపొరుగునా రీమేక్ అయ్యాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మన తెలుగు సినిమా కథలు ఇతర భాషల్లోనూ పెద్ద ఎత్తున వర్కవుటవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోనే నంబర్ 1 పరిశ్రమ బాలీవుడ్ లో మన తెలుగు సినిమా కథలపై విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు. బాహుబలి ఘనవిజయం తర్వాత ఈ తరహా దూకుడు మరింత పెరిగిందనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ లో తెలుగు సినిమాల రీమేక్ ల చరిత్ర పరిశీలిస్తే నాటి సినిమాల్లో కమల్ హాసన్ - కె.విశ్వనాథ్ కాంబినేషన్ మూవీ `శుభలగ్నం` బాలీవుడ్ లో రీమేకైంది. మహేష్ నటించిన పోకిరి - అతడు చిత్రాలు బాలీవుడ్ కి వెళ్లాయి. మహేష్ - గుణశేఖర్ ల - ఒక్కడు - రవితేజ - రాజమౌళి కాంబినేషన్ మూవీ- విక్రమార్కుడు - రామ్- శ్రీనువైట్ల -రెడీ - సునీల్ - రాజమౌళి -మర్యాద రామన్న - రవితేజ- సురేందర్ రెడ్డి - కిక్ (సల్మాన్ హీరోగా) - రామ్ - సంతోష్ శ్రీనివాస్ ల - కందిరీగ - వగైరా..చిత్రాలు బాలీవుడ్ లో ఇదివరకూ రీమేకయ్యాయి.
లేటెస్ట్ సినిమాల్లో అర్జున్ రెడ్డి - ఆర్ .ఎక్స్ 100 - ఖైదీనంబర్ 150 (కత్తి) చిత్రాలు బాలీవుడ్ లో రీమేకవుతున్నాయి. షాహిద్ హీరోగా సందీప్ రెడ్డి వంగ అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తమిళంలోనూ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా `వర్మ` పేరుతో రీమేకవుతోంది. 2కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్.ఎక్స్ 100 కథని 1.5కోట్లకు హిందీవాళ్లు కొనుక్కున్నారు. దీనికి తమిళ్ - కన్నడ రీమేక్ హక్కుల రూపంలోనూ అదనపు ఆదాయం కలిసొస్తోంది. ఈ గురువారం రిలీజైన నాగార్జున - నాని `దేవదాస్` హిందీ రీమేక్ రైట్స్ కి డిమాండ్ నెలకొందని చెబుతున్నారు. ఇంకా తమిళం నుంచి పలు భారీ చిత్రాల్ని కొనుగోలు చేసేందుకు హిందీ ఫిలింమేకర్స్ పోటీ పడుతున్నారట. తెలుగు - తమిళ సినిమాల సినిమాల రీమేక్ హక్కులకు మునుపటితో పోలిస్తే భారీ పోటీ నెలకొంటోంది. ఇరుగు పొరుగు డబ్బింగుల రూపంలోనూ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. వాస్తవానికి స్టేట్ డివైడ్ టైమ్ లో డీలాపడిన టాలీవుడ్ ని చూస్తే ఇక సీన్ అయిపోయిందా? అన్నంత పరిస్థితి కనిపించింది. రెండు మూడేళ్ల క్రితం శాటిలైట్ కొనేవాడే లేడు.. ఇంతలోనే ఎంత మార్పు! బిజినెస్ లో అనూహ్య మార్పు.. అంతా శుభ పరిణామమే..నాటి సీన్ బెంబేలెత్తించినా ఇప్పుడు అంతా పాజిటివ్ గా ఉంది అంతా. టాలీవుడ్ కి మంచిరోజులు వచ్చాయి. అన్నిరకాలా బిజినెస్ విస్తృతి పెరిగింది.