Begin typing your search above and press return to search.
యూఎస్: సరిలేరు కలెక్షన్స్ లో భారీ డ్రాప్
By: Tupaki Desk | 19 Jan 2020 7:42 AM GMTఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఇక్కడ లోకల్ గా బాక్స్ ఆఫీసుకు ఊపు తీసుకురావడమే కాదు..చాలాకాలంగా డల్ గా సాగుతున్న యూఎస్ టాలీవుడ్ బాక్స్ ఆఫీసుకు కూడా సందడి తీసుకొచ్చాయి. అయితే మొదటి వారం చివరకు రావడంతో కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పడుతోంది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది.
శనివారం నాడు వివరాలు అందేసరికి 'అల వైకుంఠపురములో' 140 లొకేషన్ల నుండి $282K కలెక్షన్స్ సాధించగా 'సరిలేరు నీకెవ్వరు'130 లోకేషన్స్ నుండి జస్ట్ $73K తో సరిపెట్టుకుంది. మహేష్ బాబు సినిమాల కలెక్షన్స్ లో ఇలాంటి డ్రాప్ గతంలో 'ఆగడు'.. 'బ్రహ్మోత్సవం' లాంటి సినిమాలకే కనిపించింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో అలాంటి డ్రాప్ కనిపిస్తోంది. రెండో వారంలో 'సరిలేరు నీకెవ్వరు' $2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఓవర్సీస్ లో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్-అల్లు అర్జున్ మ్యాజిక్ పనిచేయడంతో 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఆదివారానికి ఈ సినిమా $2.5 మిలియన్ మార్క్ చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.