Begin typing your search above and press return to search.

ఐదోరోజు స‌గం పైగా హ‌వా త‌గ్గింద‌ట‌!

By:  Tupaki Desk   |   4 Sep 2019 6:16 AM GMT
ఐదోరోజు స‌గం పైగా హ‌వా త‌గ్గింద‌ట‌!
X
డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన `సాహో` మొద‌టి వీకెండ్ వ‌సూళ్లు అద్భుతం అంటూ ట్రేడ్ ప్ర‌శంస‌లు కురిపించింది. ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 320కోట్ల ప్ర‌పంచ‌వ్యాప్త గ్రాస్ వ‌సూలు చేసింద‌ని.. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో రికార్డులు సాధించింద‌ని యు.వి.క్రియేష‌న్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే తొలి మూడు రోజులు ఉన్నంత జోరు సోమ‌వారం ఉందా అంటే లేదన్న‌ది ట్రేడ్ రిపోర్ట్. అప్ప‌టికే 50 శాతం క‌లెక్ష‌న్స్ త‌గ్గాయ‌ని ప‌లు ఏరియాల నుంచి రిపోర్ట్ అందింది. మంగ‌ళ‌వారం థియేట‌ర్ ఆక్యుపెన్సీ మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ లో చ‌ర్చ సాగింది. అయితే ఇది ప్ర‌తి పెద్ద సినిమాకి ఉండేదే అనుకుంటే ఇక‌పై సాహోకి ఇంత‌కుమించి వ‌సూళ్లు పెరిగే ఛాన్సుందా? థియేట‌ర్ల‌కు జ‌నం వెళ‌తారా? అంటే దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. మిశ్ర‌మ స్పంద‌న‌ల న‌డుమ అన్ని ఏరియాల్లో పంపిణీదారులు ఎంత‌వ‌ర‌కూ సేఫ్ అన్న‌ది విశ్లేషించాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే సాహోపై ప‌బ్లిక్ నుంచి టాక్ ర‌క‌ర‌కాలుగా ఉంది. అభిమానుల్లోనూ క్లాస్ వ‌ర్గాలు ఒక‌లా మాస్ వ‌ర్గాలు ఇంకోలా సాహో గురించి మాట్లాడ‌డం క‌నిపిస్తోంది. ఓవ‌రాల్ గా తొలి వీకెండ్ క‌లెక్ష‌న్లు బావున్నా.. కొన్ని ఏరియాల్లో పంపిణీదారుల‌కు న‌ష్టాలు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే బాలీవుడ్ రివ్యూ రైట‌ర్లు పూర్తి వ్య‌తిరేకంగా ఉన్నా బాహుబ‌లి స్టార్ గా ఉత్త‌రాదిన‌ ప్ర‌భాస్ హ‌వా క‌నిపించింది. హిందీ చిత్ర‌సీమ‌లో తొలి వారం నాటికే పంపిణీదారులు సేఫ్ అయ్యే ఛాన్సుంద‌ని అంచ‌నా వెలువ‌డింది. అక్క‌డ వ‌సూళ్లు బావున్నాయి. హిందీలో ఐదో రోజు 7కోట్లు వ‌సూలైంది. తొలి వీకెండ్ ఉత్త‌రాది నుంచి 100 కోట్లు పైగా వ‌సూలు చేసింద‌ని టాక్ వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం నుంచి తొలి వీకెండ్ అద్భుత వ‌సూళ్లు దక్కాయి.

ఉత్త‌రాదితో పోలిస్తే ద‌క్షిణాదిన కొన్నిచోట్ల క‌లెక్ష‌న్స్ తీసిక‌ట్టుగా ఉన్నాయ‌న్న రిపోర్ట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాం బావుంద‌ని వార్త‌లు వ‌చ్చినా సోమ‌-మంగ‌ళ‌వారం 50-60 శాతం ఆక్యుపెన్సీ ప‌డిపోయింద‌ని చెబుతున్నారు. అలాగే సీడెడ్ 40 శాతం న‌ష్టాలు అంచ‌నా వేస్తున్నారు. క‌ర్నాట‌క బావున్నా.. త‌మిళనాడులో చాలా డ‌ల్ గా ఉందన్న విశ్లేష‌ణ వెలువ‌డింది. త‌మిళంలో యువి క్రియేషన్స్ సొంత రిలీజ్ అన్న టాక్ ఉంది కాబ‌ట్టి అక్క‌డ నుంచి ఏ స్థాయిలో ఆర్జిస్తుంది అన్న‌ది తెలియాల్సి ఉంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింద‌ని చెబుతున్న ఈ చిత్రానికి ఆ స్థాయిలో షేర్ లేదా నెట్ వ‌సూల‌వ్వాల్సి ఉంటుంది. ఇప్ప‌టికైతే స‌గం పైగా వ‌సూలైంది. మునుముందు ఆ స్థాయి దూకుడు లేక‌పోతే న‌ష్టాలు త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.