Begin typing your search above and press return to search.

కొత్త బ‌డ్జెట్ లో టాలీవుడ్ కి పెద్ద సాయం

By:  Tupaki Desk   |   1 Feb 2019 1:29 PM GMT
కొత్త బ‌డ్జెట్ లో టాలీవుడ్ కి పెద్ద సాయం
X
పెద్ద నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ వంటి ప‌రిణామాలు టాలీవుడ్ ని తీవ్రంగా దెబ్బ కొట్టాయి. మోదీ దెబ్బ‌కు ప‌రిశ్ర‌మ‌పై కోలుకుని పంచ్ ప‌డింది. ఆ మాట‌కొస్తే ప్రాంతీయ సినిమాపై పెద్ద స‌మ్మెట పోటు ప‌డింద‌ని చెప్పాలి. మూలిగే న‌క్క‌పై తాటి పండు లా స‌క్సెస్ శాతం తీసిక‌ట్టుగా ఉన్న సినీప‌రిశ్ర‌మ‌పై జీఎస్టీ పేరుతో అసాధార‌ణ బాదుడుకు తెర‌తీయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే దీనిని కోలీవుడ్ వాళ్ల త‌ర‌హాలో వ్య‌తిరేకించ‌లేక‌.. బంద్ లు చేయ‌లేక తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి వారు చ‌ప్పున చ‌ల్లారిపోయారు.

ఇప్ప‌టివ‌ర‌కూ పెంచిన ప‌న్ను బాదుడుకు త‌గ్గ‌ట్టే చెల్లింపులు చేస్తున్నారంతా. అయితే దీని వ‌ల్ల చిన్న బ‌డ్జెట్ చిత్రాల సంఖ్య త‌గ్గిపోయింద‌ని ప‌లువురు వాపోయిన సంద‌ర్భాలున్నాయి. గ‌త కొంత‌కాలంగా ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల సంఖ్య త‌గ్గిపోయింద‌ని ఓ సీనియ‌ర్ ఆర్టిస్టు వ్యాఖ్యానించారు. దానివ‌ల్ల త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయ‌ని మీడియా ముఖంగానే వ్యాఖ్యానించారు. అదంతా అటుంచితే ఇలాంటి ప‌రిణామం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ కొంత‌వ‌ర‌కూ ఉప‌క‌రించ‌నుంద‌ని విశ్లేషిస్తున్నారు.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి పీయుష్ గోయ‌ల్ ప్ర‌వేశ‌పెట్టిన కొత్త బ‌డ్జెట్ లో సినిమా ప‌రిశ్ర‌మ‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. ముఖ్యంగా సింగిల్ విండో సిస్ట‌మ్ కి పూర్తి స్థాయిలో క్లియ‌రెన్స్ ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా హ‌ర్షానికి కార‌ణ‌మైంది. దీని వ‌ల్ల మ‌న నిర్మాత‌ల‌కు చాలా వ‌ర‌కూ అన‌వ‌స‌ర ఒత్తిడి త‌గ్గిపోతుంది. ఇన్నాళ్లు విదేశీ చిత్రాల‌కు మాత్ర‌మే ఈ విధానం అందుబాటులో ఉంటే ఇక‌పై దేశంలో అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇది అందుబాటులోకి రానుంది. అలాగే వేలాది ఉద్యోగాల్ని క‌ల్పించే ఈ ప‌రిశ్ర‌మ‌పై జీఎస్టీని 12 శాతానికి త‌గ్గిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పైరసీని అరికట్టేందుకు యాంటీ కామ్‌ కార్డింగ్‌ ప్రొవిజన్ చ‌ట్టాన్ని సినిమాటోగ్రఫి చట్టానికి జత చేయనున్నామ‌ని ప్ర‌క‌టించ‌డంతో వినోద రంగానికి ఒక్క‌సారిగా ఊపిరి పోసిన‌ట్ట‌య్యింది. అయితే ఇవ‌న్నీ ఎంత వేగంగా అమ‌లైతే అంతే మేలు జ‌రిగిన‌ట్టే. ఆల‌స్యం అమృతం విషం! అందుకే కేంద్రం స‌త్వ‌ర‌మే చ‌ర్య‌లు చేప‌డుతుందా లేదా చూడాలి. తాజా మార్పుల‌తో సినిమాలు తీసేవాళ్ల సంఖ్య పెరిగితే ఇక్క‌డ ఊపాధి అంతే వేగంగా పెరిగేందుకు సాయ‌మైన‌ట్టే.