Begin typing your search above and press return to search.
ప్రభాస్ కోసం 5 కోట్లతో హాస్పిటల్..!
By: Tupaki Desk | 22 Jun 2020 8:10 AM GMTప్రభాస్ 20వ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో ఎక్కువగా జరిగింది. ఇంకా కూడా అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూటింగ్స్ చేయలేని పరిస్థితి. కనుక హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను ఇక్కడ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం 5 కోట్లతో భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట. నాలుగు అంతస్తుల ఆ హాస్పిటల్ లో ఆపరేషన్ థియేటర్.. ఐసీయూ.. జనరల్ వార్డ్ ఇంకా హాస్పిటల్ పరసరాలు వంటివి క్రియేట్ చేస్తున్నారు. అది కూడా 1980 కాలం నాటి వాతావరణంలో హాస్పిటల్ ను తీర్చి దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిత్రీకరణ జరిపేందుకు సిద్దం అవుతున్నారు.
ఆగస్టు రెండవ లేదా మూడవ వారం నుండి ఈ షూటింగ్ ప్రారంభం అవ్వనుందట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. త్వరలోనే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా షూటింగ్ కు వెళ్లాలని యూవీ క్రియేషన్స్ నిర్ణయించిందట. ఈ ఏడాది చివరి వరకు ప్రభాస్ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తే నాగ్ అశ్విన్ మూవీ మొదలు కావాల్సి ఉంది. అందుకే ప్రభాస్ 20 చిత్రం షూట్ విషయంలో కాస్త స్పీడ్ పెంచారు.