Begin typing your search above and press return to search.
డార్లింగ్ కోసం అన్నీ ఇక్కడే క్రియేట్ చేస్తున్నారట...!
By: Tupaki Desk | 23 Jun 2020 10:50 AM GMT'డార్లింగ్' ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే జార్జియాలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఇటలీ ఆస్ట్రియాలలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించారట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూట్ చేసే అవకాశాలు లేవు. దీంతో ఇక్కడే మిగతా భాగం షూటింగ్ చేయాలని డిసైడ్ అయిందట.
ఇందులో భాగంగా హైదరాబాద్ లోనే ఇటలీ అందాలను సెట్ చేయబోతున్నారట. ఇందుకోసం ఓ భారీ సెట్టింగ్ కు ప్లాన్ చేశారట. 1970 కాలం నాటి ఇటలీ అందాలను ఆవిష్కరించేలా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఓ హాస్పిటల్ సెట్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఈ సెట్స్ లో కీలక సన్నివేశాల్ని షూట్ చేయబోతున్నారట. ఇదిలా ఉండగా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇప్పటికే చాలా మంది సంగీత దర్శకుల పేర్లు తెర మీదకి వచ్చాయి. అయితే 'సాహో' సినిమాలాగే ఈ సినిమాకి కూడా పలువురు మ్యూజిక్ డైరెక్టర్ కలిసి పని చేయబోతున్నారాట. తమిళ్ కంపోజర్ జస్టిన్ ప్రభాకరన్ కూడా ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ త్వరలోనే విడుదల కాబోతోందని సమాచారం.