Begin typing your search above and press return to search.

సినిమాకు వారం లైఫ్ చాలా ?

By:  Tupaki Desk   |   19 Jun 2019 12:30 PM GMT
సినిమాకు వారం లైఫ్ చాలా ?
X
ఒకప్పుడు గోల్డెన్ జూబ్లీ సిల్వర్ జూబ్లీ హండ్రెడ్ డేస్ లాంటివి చాలా మాములుగా ఉండేవి. ఏడాది పాటు ఆడితేనే ఇండస్ట్రీ హిట్ కింద లెక్క. మంచి టాక్ వస్తే కనీసం యాభై రోజుల దాకా థియేటర్లు కళకళలాడేవి. సరే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కాబట్టి అదే స్థాయిలో రన్ ఆశించడం అత్యాశే కానీ దీన్ని మరీ కుంచించి వారం రోజులకు తగ్గించుకోవడం మాత్రం హర్షించదగ్గ పరిణామం కాదు. నిర్మాతల సమాఖ్య కానీ మా కానీ దీని గురించి కనీసం ఆలోచన చేయకపోవడం భవిష్యత్ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది.

ఇప్పుడు దీని గురించి ప్రస్తావించడానికి కారణం ఉంది. ఎల్లుండి ఏకంగా ఆరు స్ట్రెయిట్ సినిమాలు బరిలో ఉన్నాయి. మల్లేశం-ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - ఓటర్ - ఫస్ట్ ర్యాంక్ రాజు - స్పెషల్ - స్టువర్ట్ పురం ఇలా వివిధ జానర్లలో ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. ఒకటో రెండో మంచి టాక్ తెచ్చుకుని హిట్ దిశగా వెళ్తే ఓ రెండు లేదా మూడు వారాలు నిలబడి వసూళ్లు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది

కాని ఆ అవకాశాన్ని తగ్గిస్తూ వచ్చే వారం సైతం 28న ఇదే తరహలో హైప్ ఉన్న సినిమాలే వెంటనే రావడం పైన చెప్పిన వాటి రన్ మీద ప్రభావం చూపకుండా పోవు. రాజశేఖర్ కల్కి మీద ప్రమోషన్ స్టేజి నుంచే పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. శ్రీవిష్ణు బ్రోచెవారెవరురా వెరైటీ కంటెంట్ తో యూత్ తో ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఆది సాయి కుమార్ బుర్రకథ స్టొరీ లైన్ ఏదో రెండు బ్రెయిన్ల కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా తెస్తున్నారు.

ఇప్పుడీ మూడు సినిమాలను అకామిడేట్ చేయాలంటే ముఖ్యంగా బిసి సెంటర్లలో పైన ఆల్రెడీ రన్ లో ఉన్నవాటిని తీసేయాలి. ఇవి చాలవు అన్నట్టు స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రం హోం అన్ని బాషలలో వస్తోంది. ఇలా ఒకేసారి పోటీ పడటం వల్ల నష్టం ఎవరికి అనేది ఆలోచించకుండా బరిలో దిగడం ఫైనల్ గా నిర్మాతలకు రావాల్సిన రెవిన్యూని అడ్డుకుంటోంది. ఇప్పటికైనా ఓ అండర్ స్టాండింగ్ తో పరిష్కారం దిశగా ఆలోచిస్తే బెటర్