Begin typing your search above and press return to search.

ఏపీ నైజాంలో భారీ మాల్స్ మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్స్

By:  Tupaki Desk   |   3 Aug 2019 8:07 AM GMT
ఏపీ నైజాంలో భారీ మాల్స్ మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్స్
X
ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ఎవ‌రు ఎక్క‌డ అయినా బిజినెస్ చేయొచ్చు. స‌రిగ్గా ఇదే పాయింట్ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ బిజినెస్ రేంజును అంత‌కంత‌కు పెంచుతోంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే కార్పొరెట్ దిగ్గ‌జాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాల విస్త‌ర‌ణ‌కు భారీ ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో ఎన్నారై దిగ్గ‌జాలు.. పారిశ్రామిక వేత్త‌లు భారీగా పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక ఇలా వ‌చ్చే వాళ్ల‌లో వినోద రంగంలోనూ భారీగానే పెట్టుబ‌డులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రీక‌ర‌ణ‌తో పాటు షాపింగ్ మాల్స్ క‌ల్చ‌ర్ విస్త్ర‌తంగా పెర‌గ‌డంతో ఈ త‌ర‌హా వ్యాపారాల‌కు రెక్క‌లొచ్చాయి. న‌గ‌రాల్లో విరివిగా మ‌ల్టీప్లెక్సుల్ని ప్రారంభించి బిజినెస్ ని ప‌దింత‌లు చేసేందుకు అంతా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

ఇప్ప‌టికిప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లోనూ భారీ మాల్స్ మ‌ల్టీప్లెక్స్ చెయిన్ బిజినెస్ కి స‌న్నాహాలు సాగుతున్నాయి. హైద‌రాబాద్- విజ‌య‌వాడ‌- అమ‌రావ‌తి తో పాటు క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, తిరుప‌తి- విశాఖ ప‌ట్నం-కాకినాడ‌- రాజ‌మండ్రి-క‌ర్నూలు-క‌డ‌ప‌ ఇలా ప్ర‌తిచోటా ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో భారీగా మాల్స్ ని.. మ‌ల్టీప్లెక్సుల్ని నిర్మించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అండ‌ర్ క‌న్ స్ట్రక్ష‌న్ లో కొన్ని ఉన్నాయి. మ‌రిన్ని నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవ‌లే వై స్క్రీన్స్ పేరుతో వైఎస్ టీడీ సెంట‌ర్లను ప్రారంభిస్తున్నామ‌ని తానా2019 వేడుక‌ల్లో ప్ర‌క‌టించారు. ఏపీ తెలంగాణ‌లో దాదాపు 260 వైఎస్ టీడీ మాల్స్ ని ప్రారంభిస్తే అందులో 150 వ‌ర‌కూ మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇవి మినీ మ‌ల్టీప్లెక్సుల త‌ర‌హా అని వై స్క్రీన్స్ అధినేత వై.వి.ర‌త్న‌కుమార్ ప్ర‌క‌టించారు.

ఇక వీటితో పాటు ప్ర‌ఖ్యాత స్థిరాస్తి రంగ దిగ్గ‌జం అప‌ర్ణ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్కేల్ లో మాల్స్-మ‌ల్టీప్లెక్సుల్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పైన చెప్పిన అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ సంస్థ మాల్స్-మ‌ల్టీప్లెక్సుల‌ను నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలుస్తోంది. వీళ్ల‌కు తోడు ఏషియ‌న్ సినిమాస్ స‌హా దిల్ రాజు.. డి.సురేష్ బాబు వంటి దిగ్గ‌జాలు మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్స్ రంగంలో ఉన్నారు. ఇటీవ‌లే మ‌హేష్ ఏఎంబీ సినిమాస్ ని ప్రారంభించారు. ఏఎంబీ మాల్స్ ని ప‌లు న‌గ‌రాల్లో విస్త‌రించే ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అలాగే ప్ర‌భాస్- అల్లు అర్జున్ వంటి స్టార్లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సు థియేట‌ర్ బిజినెస్ ప్లానింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.