Begin typing your search above and press return to search.
RC 15 నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ఆఫర్?
By: Tupaki Desk | 28 Dec 2022 4:30 PM GMTజక్కన్న తెరకెక్కించిన 'RRR' తరువాత మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏస్ డైరెక్టర్ శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్నాడు.
ఈ మూవీని సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో ఓ సెటైరికల్ మూవీగా వంకర్ తెరపైకి తీసుకొస్తున్నారట. ఇందులో రామ్ చరణ్ తండ్రిగా, తనయుడిగా డ్యుయెల్ లో కనిపించిబోతున్నాడు. 90వ దశకం నేపథ్యంలో తండ్రి పాత్ర సాగనుందని తెలుస్తోంది.
తనయుడి పాత్ర ప్రస్తుతం కాలానికి సంబంధించిందిగా వుంటుందట. రాజమండ్రిలో షూటింగ్ మొదలు పెట్టిన శంకర్ ఆ తరువాత పలు ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. రీసెంట్ గా న్యూజిలాండ్ కు వెళ్లిన చిత్ర బృందం అక్కడ హీరో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఓ డ్యుయెట్ ని పూర్తి చేశారు.
ఆ తరువాత కొంత విరామం తీసుకున్న చిత్ర బృందం తాజాగా రాజమండ్రి గోదావరి తీరాన ఇలుక తెన్నెలపై రామ్ చరణ్ పాల్గొనగా ఓ రాజకీయ మీటింగ్ కు సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరించారు. దీంతో ఈ షెడ్యూల్ కూడా పూర్తయింది.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజమండ్రి షెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరుగుతోందని, చరణ్ పాల్గొనగా పలు కీలక సన్నివేశాలని దర్శకుడు శంకర్ చిత్రీకరిస్తున్నరట. ఇదిలా వుంటే మరో షెడ్యూల్ ని త్వరలో హైదరాబాద్ లో ప్రారంభించనున్నారని, ఈ షెడ్యూల్ తో ఒక పాట, ఫైట్, కీలక ఘట్టాలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి కానుందట.
ఇదిలా వుంటే ఈ మూవీపై వున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి సంబంధించిన అన్ని భాషల ఓవర్సీస్ హక్కుల కోసం రూ. 45 కోట్లకు పైనే చెల్లించడానికి ఓ ప్రముఖ ఓవర్సీస్ సంస్థ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ ఛానెల్ రూ. 200 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.