Begin typing your search above and press return to search.
ఒక్క సినిమాతో హైట్ బ్యూటీకి చేతినిండా పనులు..!
By: Tupaki Desk | 24 April 2021 9:30 AM GMT'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది పొడుగుకాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా. 'చిట్టి' పాత్రలో నటించిన ఈ బ్యూటీ తన స్క్రీన్ ప్రెజన్స్ - క్యూట్ ఎక్స్ స్ప్రెషన్ తో తొలి సినిమాతోనే కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన హైట్ తో 'ఈవిడేంటి.. నా కంటే పొడుగుంది' అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆశ్చర్యపరిచి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక ఫస్ట్ మూవీతోనే భారీ సక్సెస్ అందుకున్న ఫరియా.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
హైదరాబాద్ కు చెందిన తెలుగమ్మాయి అయిన ఫారియా దాదాపు ఏడేళ్లు థియేటర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసి, 'నక్షత్ర' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడి 'జాతిరత్నాలు' సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా విజయంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు అమ్మడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్క సినిమా దెబ్బకి ఈ బ్యూటీకి ఇప్పుడు చేతి నిండా పనులు వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది.
కరోనా టైమ్ లో కూడా షాప్ ఓపెనింగ్స్ అంటూ ఫరియా బిజీబిజీగా గడుపుతోంది. ఒక్కో షాప్ ఓపెనింగ్ కి దాదాపుగా 15 లక్షల వరకు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోందని టాలీవుడ్ కాస్టింగ్ ఏజెంట్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాకున్నా, ఇప్పుడు ఇండస్ట్రీలో ఫరియాకి ఫుల్ క్రేజ్ ఉందనే విషయం వాస్తవం. ఈ హైట్ బ్యూటీకి సరైన సినిమాలు రెండు పడితే టాలీవుడ్ లో పాగా వేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ముద్దుగుమ్మకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూద్దాం.