Begin typing your search above and press return to search.
ఎక్కడికెళ్లినా అదే సినిమా
By: Tupaki Desk | 21 Sep 2017 4:30 AM GMTజైలవకుశ రిలీజ్ తో టాలీవుడ్ లో దసరా పండగ సందడి మొదలైపోయింది. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయడం.. అందులో ఒకటి విలన్ పాత్ర అని రివీల్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై బజ్ మామూలుగా లేదు. ట్రయిలర్ రిలీజ్ తర్వాత అభిమానుల్లోనూ అంచనాలు విపరీతంగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మూడొంతులకు పైగా థియేటర్లలో జైలవకుశ రిలీజవబోతోంది. అంటే దాదాపుగా ఎక్కడికెళ్లినా ఇదే సినిమా కనిపిస్తుందన్నమాట.
దీనికితోడు తెలంగాణాలో సింగిల్ స్ర్క్రీన్లలో రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం ఈమధ్య అనుమతులచ్చింది. ఈ అనుమతి వచ్చాక రిలీజవుతున్న మొదటి పెద్ద సినిమా జైలవకుశ. గురు - శుక్రవారాలకు సంబంధించి చాలా థియేటర్లలో అడ్వాన్సు బుకింగులు ఇప్పటికే అయిపోయాయి. ఇక వీకెండ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఈలెక్కన రెండు రాష్ట్రాల్లోని అత్యధిక థియేటర్లలో నాలుగు రోజులపాటు హౌస్ ఫుల్ బోర్డు తీయాల్సిన అవసరమే ఉండదు. సినిమా హిట్ టాక్ వస్తే విజయదశమి వరకు కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తూనే ఉంటుంది.
ఈనెల మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఏ ఒక్కటీ హిట్ టాక్ తెచ్చుకోలేదు. కొన్ని సినిమాలకు మొదటి రోజునే థియేటర్లలో జనాలు కరవయ్యారు. వీకెండ్ లోనూ థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఓ మాటలో చెప్పాలంటే థియేటర్లు కళకళలాడి చాలా రోజులైంది. ఏ కోశానా పోటీ అనేది లేకపోవడం జైలవకుశకు తెగ కలిసొచ్చింది.