Begin typing your search above and press return to search.
డార్లింగ్ దెబ్బకు క్రాష్ అయిపోయిందంతే!
By: Tupaki Desk | 29 Dec 2022 5:45 PM GMTఎన్.బి.కె అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 సంచలనంగా మారుతోంది. వారం వారం ప్రత్యేక అతిథులు ఈ వేదికపై బోలెడంత సందడి చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్బీకేతో షోలో పలువురు అగ్ర హీరోలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా జాయినయ్యారు.
అయితే డార్లింగ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ దృష్ట్యా ఆహా యాప్ క్రాష్ అయిందని తెలిసింది. ప్రభాస్ చాలా కాలానికి ఇలా ఓటీటీలో కనిపించడం విపరీతంగా అభిమానుల దృష్టిని ఆకర్షించిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎపిసోడ్ లోని మొదటి భాగాన్ని బాహుబలి అని పిలుస్తున్నారు. ఇది ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారమైంది. కానీ స్ట్రీమింగ్ ప్రారంభించిన వెంటనే యాప్ క్రాష్ అయింది. వీక్షకుల నుండి వచ్చే భారీ ట్రాఫిక్ ను నిర్వహించలేక సర్వర్ డీలా పడిపోయింది.
ఇదే విషయాన్ని అంగీకరిస్తూ ఆహా ట్వీట్ చేస్తూ డార్లింగ్ #ప్రభాస్ అభిమానుల ప్రేమ ఓవర్ లోడ్ కారణంగా మా యాప్ క్రాష్ అయిందని మీకు తెలియజేస్తున్నందుకు క్షమించండి...మేము దానిపై పని చేస్తున్నాము. ఇది త్వరలో నరుద్ధరిస్తాం`` అని తెలిపారు. .#PrabhasOnAha #UnstoppableWithPrabhas హ్యాష్ ట్యాగులు వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉన్న ప్రభాస్ ఎపిసోడ్ ని మిస్సవ్వాలని ప్రపంచవ్యప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు కోరుకోరు.ఆ మేరకు ఆహాకు ధీమా ఉంది. ప్రస్తుతానికి ఆహా యాప్ ఇప్పటికీ డౌన్ లో ఉంది. ఇది ఆన్ లైన్ లో తిరిగి ఎప్పుడు వస్తుందో చూడాలి. NBKతో అన్‌స్టాపబుల్ 2 కొత్త ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా టీమ్ లో చేరతాడు. ఈ వేదికపై ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల గురించి బాలయ్య ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో చూడాలి.