Begin typing your search above and press return to search.

దేవరకొండ ఇమేజ్ తో డెబ్యూ డైరెక్టర్ కు టెన్షన్!

By:  Tupaki Desk   |   23 Aug 2018 11:21 AM GMT
దేవరకొండ ఇమేజ్ తో డెబ్యూ డైరెక్టర్ కు టెన్షన్!
X
అందరూ సక్సెస్ వస్తే చాలు అనుకుంటారు గానీ ఒక అమెరికా పెద్దయన చెప్పినట్టు 'సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్'. సినిమా భాషలో చెప్తే 'బాహుబలి' తీసి బ్లాక్ బస్టర్ కొట్టాముగా అని కాస్త ఊపిరి పీల్చుకునే లోపు 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?'అని అడుగుతారు. ఎంతో శ్రమపడి సమాధానం చెప్పి ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద హిట్ కొడితే అప్పుడు చప్పట్లు కొట్టి సరే మీరు రెస్టు తీసుకోండి జక్కన్న గారు.. చెక్కి చెక్కి అలిసిపోయారు అని అంటే ఒట్టు! వెంటనే 'నెక్స్ట్ ఏంటి?' అని అడుగుతారు. అదేగా ఆ పెద్దాయన 'సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్' అని చెప్పిన కొటేషన్ కి అర్థం!

అంటే మీరు సక్సెస్ సాధించాము కదా అని సోఫాలో తీరిగ్గా కూర్చుని యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోలు చూసుకుంటూ మిగతా జీవితం గడపలేరు. సక్సెస్ సాధిస్తే నెక్స్ట్ టార్గెట్ 'అంతకు మించి' అన్నట్టుగా ఉంటుంది. టాలీవుడ్ తాజా స్టార్ విజయ్ దేవరకొండ తాజా సినిమాల పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. 'గీత గోవిందం' సక్సెస్ తో లైన్లో ఉన్న నాలుగు సినిమాలపై అంచనాలు భారీ గా పెరిగాయి. ఇక ఆ సినిమాల్లో ఒకటి అయిన 'డియర్ కామ్రేడ్' సినిమా కు డైరెక్టర్ భరత్ కమ్మ. భరత్ కు ఈ సినిమానే డెబ్యూ.

ఇక ఈ సినిమాలో విజయ్ కాకినాడ కుర్రాడిగా ఆంధ్ర యాసలో మాట్లాడతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తున్న విజయ్ ..పైగా డియర్ కామ్రేడ్ అనే పవర్ ఫుల్ టైటిల్ అనగానే 'అర్జున్ రెడ్డి' లాంటి ఇంటెన్స్ పాత్రను ఊహించుకుంటారు. పైగా వరస హిట్లు.. స్టార్డం లాంటివి సినిమా పై అంచనాలు పెరిగేలా చేస్తాయి. మరి ఇవన్నీ కొత్త డైరెక్టర్ కు ప్రెజర్ పెంచేవి లా ఉన్నాయని అంటున్నారు. విజయ్ ను ఈ సమయంలో డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం గోల్డెన్ ఛాన్సే గానీ.. కాయిన్ కు మరో వైపు చూస్తే అంచనాల ప్రెజర్ టెన్షన్ పెంచేదే. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ లాంటి బ్యానర్ కాబట్టి డైరెక్టర్ కు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. మరి గోవిందాన్ని భరత్ కమ్మ ఎలా కాకినాడ కుర్రాడిగా మారుస్తాడో వేచి చూడాలి.