Begin typing your search above and press return to search.
బాబాయ్ పేరు, మావయ్య పాట-మెగా ప్రెజర్
By: Tupaki Desk | 4 Feb 2018 11:33 AM GMTమెగా ఫాన్స్ ను అలరించేందుకు వరస తేదిల్లో రాబోతున్న ఇంటెలిజెంట్, తొలిప్రేమ సినిమాలపై భీభత్సమైన బజ్ ప్రస్తుతానికి లేదు కాని మెల్లగా బిల్డ్ చేసే పనిలో ఉన్నాయి సదరు యూనిట్స్. రెండు ఒకదానికొకటి సంబంధం లేని జానర్స్ కావడంతో సక్సెస్ కావడం పట్ల ఇద్దరు నిర్మాతలు నమ్మకంగానే ఉన్నారు. దానికి తోడు సాయి ధరం తేజ్ కు, వరుణ్ తేజ్ కు పెద్ద హిట్ కావాల్సిన టైంలో వస్తున్న సినిమాలివి. తొలిప్రేమ సినిమా పేరు గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ కాబట్టి ఆ స్థాయిలో మేజిక్ అభిమానులు ఆశిస్తారని ముందే ఊహించిన దర్శకుడు వెంకీ - హీరో వరుణ్ పదే పదే దాన్ని టచ్ చేయలేమని చెబుతూ ముందే ప్రిపేర్ చేస్తున్నారు. చిన్న తేడా వచ్చిన పాత తొలిప్రేమతో పోలిక పెట్టి అసలుకే మోసం వచ్చే పరిస్థితి రావొచ్చు. అందుకే ఇది డిఫరెంట్ లవ్ స్టొరీ అనే పాయింట్ ని ఫాన్స్ మనసులో నాటే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్ లో స్టైలింగ్ తో సహా చిరు ని ఇమిటేట్ చేసే ప్రయత్నం తేజులో కనిపిస్తోంది . ఆడియోలో ఇప్పటిదాకా విపరీతమైన ఆసక్తి రేపిన పాట కొండవీటి దొంగ సినిమాలోని చమక్ చమక్ రీమిక్స్. దీన్ని తమన్ కంపోజ్ చేసిన తీరు, ఎస్పి చరణ్-హాసిని పాడిన తీరు ఒరిజినల్ కు సాటి రాలేదనే కామెంట్స్ నేపధ్యంలో దీన్ని పిక్చరైజేషన్ మీదే తేజు హోప్స్ అన్ని ఉన్నాయి. చిరు వేసిన సిగ్నేచర్ స్టెప్స్ తో పాటు దాన్ని చెడగొట్టలేదు అనే నింద రాకుండా వినాయక్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. మరి ఆ అంచనాలు మోయటం అంటే అంత ఈజీ కాదు. ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే మావయ్య పాటలు రెండు వాడుకున్న తేజు దీన్ని సెంటిమెంట్ గా కూడా భావిస్తున్నాడు.
ఇలా దేనికవే ప్రెజర్ లో వస్తున్న సినిమాలు ఈ రెండు. రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ ఇవ్వడం కొసమెరుపు. ఇంటెలిజెంట్ 9నే విడుదల అవుతుంది కాబట్టి తొలిప్రేమ మొదటి ఆట పడేలోపు దాని స్టేటస్ బయటపడి ఉంటుంది. ఒక్క రోజే ఆలస్యం కాబట్టి తీవ్ర ప్రభావం ఉండదు కాని ఏది బాగుంది అనే చర్చ అయితే తప్పకుండా వస్తుంది. మరి ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం పదో తేది నాడు తేలుతుంది.