Begin typing your search above and press return to search.
‘మాస్టర్’ ఓటీటీ రేటెంతో తెలుసా..? నిర్మాతకు పండగే
By: Tupaki Desk | 30 Jan 2021 2:00 PM ISTకరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడడంతో.. వాటికి ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చినవే ఓటీటీలు. లాక్ డౌన్ కాలంలో పలు సినిమాలు ఇందులో రిలీజ్ అయ్యాయి. అయితే.. థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా వీటి ప్రభావం తగ్గలేదు. అందుకే.. థియేటర్లలో సినిమాలు రిలీజైన తర్వాత.. మళ్లీ ఓటీటీ బాట పడుతున్నాాయి. ఈ విధంగా తమిళ్ స్టార్ విజయ్ మాస్టర్ మూవీకూడా ఓటీటీ బాట పట్టింది. అయితే.. దీనికోసం ఓటీటీ సంస్థ భారీగానే చెల్లించిందని సమాచారం.
మాస్టర్ మూవీ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ క్రేజ్‌తో భారీగా వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద దళపతి స్టామినా ఏంటో ఈ సినిమా కలెక్షన్లు అద్దం పట్టాయి. రెండు వారాల్లో రూ.200 కోట్లు సాధించి సత్తా చాటింది. లాక్‌డౌన్ తర్వాత భారీ వసూళ్లను రాబట్టిన ఏకైక చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది.
అయితే.. విజయ్ చిత్రం థియేటర్లలోకి రాకముందే అమెజాన్‌తో ఒప్పందం కుదిరింది. నేరుగా అమెజాన్‌లో రిలీజ్ చేస్తే ఊహించని మొత్తాన్ని ఇవ్వడానికి సంస్థ ముందుకు వచ్చింది. కానీ.. థియేటర్లలో రిలీజ్ చేయాలనే సంకల్పంతోనే ఏడాదిపాటు ఎదురు చూశారు.
కాగా.. జనవరి 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాస్టర్ రిలీజ్ అయ్యింది. మాస్టర్ చిత్రం ఓటీటీ హక్కుల కోసం తొలుత అమెజాన్ రూ.36 కోట్లకుపైగా చెల్లించినట్టు సమాచారం. అయితే.. సినిమా రిలీజ్ తర్వాత రెండువారాల్లోపే ఓటీటీలో రిలీజ్ చేసినందుకు నిర్మాతకు అదనంగా 15.5 కోట్లు ముట్ట జెప్పినట్టు సమాచారం. అంటే.. మొత్తంగా మాస్టర్ చిత్ర నిర్మాతకు అమెజాన్ నుంచి రూ.51 కోట్లకుపైగా ముట్టినట్టు సమాచారం.